ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ క్లోజ్‌!

ABN , First Publish Date - 2021-05-22T09:06:53+05:30 IST

పాతికేళ్ళకు పైగా సేవలు అందిస్తున్న ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’కు మైక్రోసాఫ్ట్‌ స్వస్తి పలుకుతోంది. 2022 జూన్‌ 15 నుంచి దీనికి ఇస్తున్న సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ ఆపేస్తుంది.

ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ క్లోజ్‌!

పాతికేళ్ళకు పైగా సేవలు అందిస్తున్న ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’కు మైక్రోసాఫ్ట్‌ స్వస్తి పలుకుతోంది. 2022 జూన్‌ 15 నుంచి దీనికి ఇస్తున్న సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ ఆపేస్తుంది. ఎక్స్‌ప్లోరర్‌ వినియోగదారులు దాదాపుగా తగ్గిపోవడమే ఈ నిర్ణయానికి అసలు కారణం.  మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌కు ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మోడ్‌ ఉంది. ఇన్‌-బిల్ట్‌ సదుపాయం ఉంది. అలా ఉన్న సదుపాయంతో సంబంధింత అప్లికేషన్స్‌ను కొనసాగించవచ్చు. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను తొలగించే పనిని గత ఏడాది నుంచే మైక్రోసాఫ్ట్‌   మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్‌ టీమ్‌ వెబ్‌ను దీన్ని నుంచి తొలగించింది. అలాగే 365 సర్వీసులను తీసేసింది. 

Updated Date - 2021-05-22T09:06:53+05:30 IST