ఎగిరే మొబైల్ టవర్ సాయంతో అక్కడ ఇంటర్నెట్ సేవలు

ABN , First Publish Date - 2020-02-22T12:35:33+05:30 IST

టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకు నూతన ఆవిష్కరణలు పుట్టుకువస్తున్నాయి. కలలో కూడా ఆలోచించలేని అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఇంటర్నెట్ సాయంతో ఈ నూతన ఆవిష్కరణలు...

ఎగిరే మొబైల్ టవర్ సాయంతో అక్కడ ఇంటర్నెట్ సేవలు

పూణె: టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకు నూతన ఆవిష్కరణలు పుట్టుకువస్తున్నాయి. కలలో కూడా ఆలోచించలేని అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఇంటర్నెట్ సాయంతో ఈ నూతన ఆవిష్కరణలు అందరికీ తెలియడంతో పాటు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఎగిరే మొబైల్ టవర్ రూపొందించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం డ్రోన్‌ను వినియోగిస్తోంది. చూసేందుకు ఈ టవర్ ఒక డైనింగ్ టేబుల్ మాదిరిగా ఉంటుంది. ఒక పెద్ద తీగ సాయంతో దీనిని అనుసంధానిస్తారు. దీనిని డ్రోన్ మాదిరిగా ఎగురవేయడం ద్వారా ఎటువంటి ప్రాంతంలోనైనా ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందవచ్చు. ఇప్పుడు ఈ టెక్నాలజీని మన దేశంలోని గోవాలో వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


Updated Date - 2020-02-22T12:35:33+05:30 IST