సంప్రదాయక డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్‌

ABN , First Publish Date - 2020-08-11T08:58:53+05:30 IST

నూతన విద్యావిధానం అమల్లో భాగంగా సంప్రదాయక డిగ్రీ కోర్సుల్లోనూ ఇంటర్న్‌షిప్‌ / అప్రెంటి్‌సషి్‌పను చేర్చేందుకు రంగం సిద్ధమైంది.

సంప్రదాయక డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్‌

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): నూతన విద్యావిధానం అమల్లో భాగంగా సంప్రదాయక డిగ్రీ కోర్సుల్లోనూ ఇంటర్న్‌షిప్‌ / అప్రెంటి్‌సషి్‌పను చేర్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు కేవలం వృత్తి నైపుణ్య విద్యను అభ్యసిస్తోన్న విద్యార్థులకు మాత్రమే చదువుతో పాటుగా పారిశ్రామిక శిక్షణ పొందే అవకాశం కోర్సు పొందికలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీలను అభ్యసించే విద్యార్థులకు సైతం ఇంటర్న్‌షి్‌పను జోడించాలని నిర్ణయించింది. తదనుగుణంగానే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) డిగ్రీలో ఇంటర్న్‌షి్‌పకు అవసరమైన మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం యూజీ కోర్సులను నిర్వహిస్తున్న కళాశాలలు వివిధ పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షి్‌పకు మొత్తం కోర్సులో 20 శాతం వరకూ క్రెడిట్లు ఇస్తారు. 24 క్రెడిట్లు సాధించిన విద్యార్థులు మాత్రమే పీజీ ప్రోగ్రామ్‌లో చేరడానికి అర్హలు. విద్యార్థులు కళాశాలల్లో కాకుండా వారు ఎంచుకున్న పరిశ్రమలకు వెళ్లి ఇంటర్న్‌షిప్‌ చేయవలసి ఉంటుంది.


డిగ్రీ కోర్సు మూడేళ్లు/నాలుగేళ్లు ఉన్నా కోర్సు కాల వ్యవధిలో కనీసం ఒక సెమిస్టర్‌ను ఇంటర్న్‌షి్‌పకు కేటాయించాలి. మూల్యాంకనం విశ్వవిద్యాలయం, పరిశ్రమ... ఉమ్మడిగా చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థలు, పరిశ్రమలు ఎలాంటి పాత్ర వహించాలో మార్గదర్శకాల్లో వివరించారు. ఇలా అవార్డు చేసే డిగ్రీలనే గుర్తిస్తామని సుస్పష్టంగా యూజీసీ తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని అమలు చేస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. మూడేళ్లు అకడమిక్‌ లెర్నింగ్‌కు, నాలుగో సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ కోసం కేటాయిస్తూ రాష్ట్రం ప్రణాళికలు తయారు చేసుకుంది.

Updated Date - 2020-08-11T08:58:53+05:30 IST