‘పల్లె ప్రగతి’ పనుల అడ్డగింత

ABN , First Publish Date - 2021-06-19T06:16:00+05:30 IST

సంస్థాన్‌నారాయణ పురం మండలం పల్లగట్టుతండాలో శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు పను లను ప్రారంభించేందుకు వెళ్లిన ప్రజాప్రతిని ధులు, అధికారులను అటవీ శాఖ అఽధికారులు అడ్డుకు న్నారు.

‘పల్లె ప్రగతి’ పనుల అడ్డగింత
ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

సంస్థాన్‌ నారాయణపురం, జూన్‌ 18: సంస్థాన్‌నారాయణ పురం మండలం పల్లగట్టుతండాలో శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు పను లను ప్రారంభించేందుకు వెళ్లిన ప్రజాప్రతిని ధులు, అధికారులను అటవీ శాఖ అఽధికారులు అడ్డుకు న్నారు. పల్లగట్టుతండాలో శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు నేటికీ చేపట్టలేదు. గురువారం అదనపు కలెక్టర్‌ కిమ్యానా యక్‌ సంస్థాన్‌నారాయణపురం మండల పరిషత్‌ కార్యాల యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇప్పటి వరకు పనులు ప్రారంభించని గ్రామాల్లో తక్షణమే ఈ పనులను చేపట్టాలని ఆదేశించారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల నిర్మా ణం కోసం శుక్రవారం సర్పంచ్‌ విజయ, పీఆర్‌ ఏఈ, ఉపాధిహామీ ఈసీ, గ్రామస్థులు గతంలో అటవీ శాఖ అధికారులు సూచించిన స్థలాల్లో పనులు ప్రారంభించేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి పనులను చేయొద్దని అడ్డుకున్నారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని, అప్పటి వరకు పనులు చేయొద్దని తేల్చి చెప్పారు. ఒకవేళ పనులు ప్రారంభిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి జరిగిన విషయాన్ని ఎంపీడీవోకు వివరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రజాప్రతి నిధులు ఎంపీడీవోకు విన్నవించారు.

Updated Date - 2021-06-19T06:16:00+05:30 IST