Abn logo
Sep 20 2021 @ 00:43AM

గణేష్‌ శోభాయాత్రకు ఆటంకం

నిర్మల్‌లోని గణేష్‌ మండపం వద్ద గుమిగూడిన జనం

డీజేలకు అనుమతించని పోలీసులు  

గణేష్‌ విగ్రహాల వద్ద గుమిగూడిన జనం 

అడుగడుగునా పోలీసు బందోబస్తు   

ఎస్పీతో చర్చల తర్వాత ఊరేగింపునకు అనుమతి

నిర్మల్‌కల్చరల్‌, సెప్టెంబరు 19 : జిల్లాకేంద్రంలో గణేష్‌ శోభాయాత్రకు ఆటంకం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజేలకు అనుమతి లేదని పోలీసులు అ డ్డుకోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారి వేడేక్కింది. ఎట్టకేలకు ఎస్పీతో చర్చ ల అనంతరం ప్రారంభం కావడంతో ఇటు పోలీసులు.. అటు మండపాల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాకేంద్రంలో ప్రతీసారి నంబర్‌ వన్‌ గణేషుని మండపం వద్ద మధ్యాహ్నం ఒంటిగంటకు శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎప్పటిలాగే శోభాయాత్రను నిర్వహించేందుకు నంబర్‌ వన్‌ గణప తి విగ్రహం ఉన్న బుధవార్‌పేట్‌కు ప్రజలు చేరుకున్నారు. ఊరేగింపు ప్రారంభించే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజేలకు అనుమతి లేదని అడ్డుకున్నారు. సాయంత్రం 5 గంటలు అయినా శోభాయాత్ర ప్రారంభం కాకపోవడంతో ప్రజలు, మండపాల నిర్వాహకులుడీజేలకు అనుమతించాలని కోరుతూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. 

ఎస్పీతో చర్చలు..

గణేష్‌ మండపాల, ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్పీ క్యాంపు కార్యాలయం లో సాయంత్రం 5 గంటల వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నా అనుమతిపై స్పష్టమైన హామీ రాలేదు. మరోవైపు పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలస్యమైన కొద్దీ గణేష్‌ మండపాల వ ద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు శో భాయాత్రను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాలల్లో ప్రజలు పెద్ద సంఖ్య లో బారులు తీరారు. 

ఎట్టకేలకు ప్రారంభం.. 

ఎట్టకేలకు ఆదివా రం సాయం త్రం 7.30 గంటలకు నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. తక్కువ కెపాసిటీ గల రెండు 750 మెగావాట్లకు అనుమతించడంతో శోభాయాత్రకు ఏ ర్పాట్లు చేసుకున్నారు. చైర్మన్‌ ఈశ్వర్‌ బుధవార్‌పేట్‌లోని ఒక టో నంబర్‌ గణేషునికి పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌ మాట్లాడుతూ.. శో భాయాత్ర శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. ఉత్సవ కమిటీ అధ్యక్షు డు మారుగొండ రాము, కౌన్సిలర్‌ అ య్యన్న గారి రాజేందర్‌, నాయకు లు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌, మెడిసెమ్మ రాజు, కోటగిరి అ శోక్‌, భక్తులు తదితరులు పాల్గొన్నారు.