Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్షాలతో రాకపోకలకు అంతరాయం

 చిట్వేలి, నవంబరు28 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిట్వేలి-నెల్లూరు సరిహద్దు అనుంపల్లె వద్ద లోలెవల్‌ వాగుపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవమాచుపల్లె వద్ద వడిసెల వంక వరద నీరు పొంగడంతో 15 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. యల్లమరాజు చెరువు, నగిరిపాడు చెరువులు వర్షాలతో నిండుకుండలా మారి అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలకు 127.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఏఎ్‌సఐ దామోదర్‌ తెలిపారు. 


Advertisement
Advertisement