Abn logo
Sep 26 2021 @ 23:40PM

ఆద్యంతం ఆసక్తిగా..

ఇంటర్వ్యూలో షర్మిలతో మాట్లాడుతున్న ఎండీ రాధాకృష్ణ

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో షర్మిల కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు

వైసీపీ నేతల్లోనూ ఆతృత... ప్రసారం చేయని ఆపరేటర్లపై 

ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో షర్మిల కార్యక్రమాన్ని జిల్లాలోని రాజకీయ ప్రముఖులు, విశ్లేషకుల నుంచి సాధారణ ప్రజానీకం వరకూ ఆసక్తిగా వీక్షించారు. అనేక ప్రాంతాల్లో కేబుల్‌ ఆపరేటర్లు ఏబీన్‌ ఛానల్‌ని ప్రసారం చేయ కపోయినా యూ ట్యూబ్‌, ఇంటర్నెట్‌లలో చూశారు. సాధారణ  ప్రజల తోపాటు, యావత్తు రాజకీయ వర్గాల వారు ఈ కార్యక్రమాన్ని వీక్షించటం కనిపించింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశే ఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఇటీవల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం, తన అన్న అయిన మన ముఖ్యమంత్రి జగన్‌పై విసుర్లు విసరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ఎండీ, సీనియర్‌ జర్నలిస్టు రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయం గత మూడు రోజుల నుంచి వివిధ రూపాల్లో ప్రజలకు అందించింది. దీంతో ఆదివారం రాత్రి ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ ప్రసారమవుతున్నంత సేపు సామాన్య ప్రజానీకం, ప్రత్యేకించి రాజకీ య పార్టీల నాయకులు ఆసక్తిగా వీక్షించారు. అయితే ప్రభుత్వ ఆంక్ష లతో అనేక ప్రాంతాల్లో ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేయటంతో ఆ యా ప్రాంతాల్లో  ప్రజలు ఆపరేటర్లను దూషించడం, వారిపై ఆగ్ర హం వ్యక్తం చేయటం కనిపించింది. అయితే ఎప్పుడూ లేనివిధంగా మారుమూల గ్రామాలలో సైతం ప్రజలు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని వీక్షించటం విశేషం.