జమ్మికుంటలో సినీఫక్కీలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-01-17T05:54:19+05:30 IST

ఒంటరి మహిళలే లక్ష్యంగా మెడలోని బంగారు గొలుసులు, పుస్తెలతాళ్లను దొంగిలిస్తూ పూటకో గ్రామం, రోజుకో పట్టణం మారు తూ తప్పించుకు తిరుగుతున్న అంత ర్రాష్ట్ర దొంగలముఠా నాయకుడిని పోలీ సులు వేటాడి పట్టుకున్నారు.

జమ్మికుంటలో సినీఫక్కీలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
మాట్లాడుతున్న పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి

అరెస్టులో సీసీకెమెరాలదే కీలకపాత్ర 

నిందితుడు పది రాష్ట్రాల్లో మోస్ట్‌వాంటెడ్‌

సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి 

కరీంనగర్‌ క్రైం, జనవరి 16: ఒంటరి మహిళలే లక్ష్యంగా మెడలోని బంగారు గొలుసులు, పుస్తెలతాళ్లను దొంగిలిస్తూ పూటకో గ్రామం, రోజుకో పట్టణం మారు తూ తప్పించుకు తిరుగుతున్న అంత ర్రాష్ట్ర దొంగలముఠా నాయకుడిని పోలీ సులు వేటాడి పట్టుకున్నారు. ఈ మేరకు సీపీ కమలాసన్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. 2020 డిసెంబరు 1న ఉద యం7:30గంటలకు కరీంనగర్‌ కూర గాయల మార్కెట్‌ప్రాంతంలో నడుచుకుంటూ వెళు తున్న ఒక వృద్ధురాలి మెడలోని బంగారు గొలు సును బైక్‌ పైవచ్చిన ఇద్దరుదొంగలు తెంపుకుని పారిపో యారు. ఈ కేసును ఛేదించేందుకు సీపీ ప్రత్యేక పోలీస్‌బృందాలను ఏర్పాటు చేశారు. 

కేసుపరిశోధనలో భాగంగా సంఘటనస్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దొంగలు ఎటువైపు ఏ సమయంలో నగరంలోకి ప్రవేశించారు. ఎటువైపు నుంచి బటయకు వెళ్లారనేది తెలుసుకున్నారు. దొంగలు నంబర్‌లేని బైక్‌పై వెళ్లినమార్గంలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌వరకు సీసీ కెమెరా లను పరిశీ లిస్తూ వెళ్లగా కీలకమైనఆధారం లభిం చింది. దొంగలు వెళుతున్న మార్గంలో గుండ్లపల్లి, సిద్ధిపేట టోల్‌గేట్‌ సమీపం, శామీర్‌పేట, హైదరా బాద్‌లలో కూడా బైక్‌ ముందు ఒక కారు వెళుతుం డటం గమనించారు. ఆ కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరపగా ఆ కారు కర్ణా టక బీదర్‌కు చెందినదిగా గుర్తించారు. గతంలో ఆ కారులో వెళుతూ ఇతరప్రాంతాల్లో పలు గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులకు సమా చారం అందింది. ఈ నిందితులు బీదర్‌ ఇరానీ గ్యాంగ్‌కు చెందిన వారుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంకే ముంది.. ఆ ఇరానీగ్యాంగ్‌ను పట్టు కునేందుకు 40రోజులుగా ప్రత్యేక పోలీసుబృందాలు హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ముంబాయి ప్రాంతాల్లో తిరిగారు. చివరికి బీదర్‌లో ఆ ముఠా సభ్యుల ఇళ్లపై దాడిచేసి పట్టుకునేందుకు ప్రయ త్నించారు. ఐతే పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పిం చుకున్నారు. చివరకు ఇరానీ గ్యాంగ్‌లీడర్‌ అయిన భాకర్‌అలీ అలియాస్‌ బుల్లెట్‌భాకర్‌ అలియాస్‌ అక్బర్‌అలీ (35)శనివారం జమ్మికుంట రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఒంటరిమహిళలను గమనిస్తూ తిరుగుతుండగా అరెస్టుచేశారు. 

నిందితుడినుంచి 5కిలోల గంజాయి, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై 120చెయిన్‌స్నా చింగ్‌ కేసులున్నాయి. ఈముఠాకు చెందిన తాలిబ్‌ హుస్సేన్‌ను గతేడాది డిసెంబరు11న అరెస్టుచేశారు. ఇదేముఠాకు చెందిన బీదర్‌కుచెందిన జైదీ అబ్బాస్‌, గులాంఅలీ అలియాస్‌రాధే, హుస్సేని, బిలాల్‌ల కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు. ఈముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీ సులపై దాడులకు ప్రయత్నించారని తెలిపారు. అక్బర్‌అలీని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషిం చిన కరీంనగర్‌ ఏసీపీ పీ అశోక్‌, సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీఐలు జీ విజయ్‌కుమార్‌, సృజన్‌రెడ్డి, సురేష్‌, మురళి, ఎస్సై, సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించి నగదు రివార్టులను అంద జేశారు. ప్రతిష్ఠాత్మకమైన పతకాలకు ప్రతిపాద నలు పంపిస్తామని ప్రకటించారు.

Updated Date - 2021-01-17T05:54:19+05:30 IST