25న వైద్య నిపుణుల పోస్టులకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-01-23T06:37:50+05:30 IST

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో జనరల్‌ ఫిజీషి యన్‌, ఆడియో మెట్రీషియన్‌ వైద్య నిపుణుల నియామకాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ బి.రవి తెలిపారు.

25న వైద్య నిపుణుల పోస్టులకు ఇంటర్వ్యూలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 22 : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో జనరల్‌ ఫిజీషి యన్‌, ఆడియో మెట్రీషియన్‌ వైద్య నిపుణుల నియామకాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ బి.రవి తెలిపారు. అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయానికి హాజరుకావాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం స్కీంలో గైనకాలజి(8 పోస్టులు), జెరియాట్రిక్‌(10), ఈఎన్‌టీ (9), పిడియాట్రిక్స్‌ (10), కిన్‌ (10), ఆర్థోపెడిక్స్‌(9), చెస్ట్‌(10), ఎన్‌సీడీ(9), జనరల్‌ సర్జరీ (8) వైద్య నిపుణుల నియామకాలకు ఈ నెల 25న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రవి తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో 25వ తేదీ హాజరుకావాలని సూచించారు. వివరాలకు  westgodavari.ap.gov.in  వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. 

Updated Date - 2022-01-23T06:37:50+05:30 IST