ఇంటింటా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-18T05:23:42+05:30 IST

జిల్లాను వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు వైద్యబృందం రంగంలోకి దిగింది. ఫీవర్‌ సర్వే పేరిట ఇంటింటికీ వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించింది.

ఇంటింటా ఫీవర్‌ సర్వే

జిల్లాలో 5323 మంది బాధితులు

వారిలో ఎందరు కరోనా బాధితులో..

బాధితులకు ర్యాపిడ్‌ టెస్టులు

మళ్లీ నేటి నుంచి 7వ విడత చివరి సర్వే

కడప, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాను వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు వైద్యబృందం రంగంలోకి దిగింది. ఫీవర్‌ సర్వే పేరిట ఇంటింటికీ వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించింది. వారిలో కరోనా బాధితులెందరో.. బాధితులకు ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించింది. వైద్యబృందం నిర్వహించిన చివరి సర్వేలో 5323 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యబృందం గుర్తించింది. వారందరికీ పారాసిటమాల్‌, జింకోవిట్‌ మరికొన్ని మందులతో కూడిన కిట్‌ను అందజేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జ్వరం, కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటా ఫీవర్‌ సర్వేను నిర్వహించారు. జిల్లాలో 1245 మంది ఏఎనఎంలు, 2036 మంది ఆశావర్కర్లు, 7,88,572 ఇళ్లల్లో సర్వే నిర్వహించారు. ఎవరెవరు జ్వరంతో బాధపడుతున్నారు, ఎక్కడెక్కడ ట్రీట్‌మెంటు చేసుకుంటున్నారనే విషయాలపై మూడురోజుల పాటు సర్వే చేశారు. 5323 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 3 వేల మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచవో అనిల్‌కుమార్‌ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. పాజిటివ్‌ నిర్ధారణ అయితే లక్షణాలను బట్టి హోం ఐసోలేషనలో ఉంచాలా, లేక ఆసుపత్రికి పంపాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 7వ విడత సర్వే మళ్లీ మంగళవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఫీవర్‌ సర్వే ద్వారా అనుమానితులకు టెస్టులు చేసి వెంటనే ట్రీట్‌మెంటు స్టార్ట్‌ చేస్తే జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చన్నారు. కనుక ఇంటింటికి వచ్చే ఏఎనఎం, ఆశావర్కర్లకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


815 కేసులు నమోదు

ఇటీవల వరుసగా ఉగ్రరూపం దాల్చిన కరోనా కాస్త శాంతించింది. రోజూ వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. అయితే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం 8 గంటల మధ్య 815 మందిలో పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటినలో వెల్లడించింది. మొత్తం కేసులు 83,968కు చేరుకున్నాయి. మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 592కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న 1224 మందిని డిశ్చార్జి చేశారు. రికవరీ సంఖ్య 72,574కు చేరుకుంది. హోం ఐసోలేషనలో 8621 మంది, ఆసుపత్రుల్లో 2034 మంది చికిత్స పొందుతున్నారు. 


మండలాల వారీగా కేసులు పరిశీలిస్తే.. 

కడపలో 87 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ రేటు 10.7గా నమోదై ఉంది. రాయచోటిలో 70 కేసులు నమోదు కాగా అక్కడ 8.7గా ఉంది. పులివెందులలో 51, రైల్వేకోడూరు 39, బద్వేలు 37, రాజంపేట 36, పెనగలూరు 32, జమ్మలమడుగు 28, ప్రొద్దుటూరు 28, వేముల 27, ఓబులవారిపల్లె 26, పోరుమామిళ్ల 23, లింగాల 22, కమలాపురం 21, నందలూరు 21, ఒంటిమిట్ట 20, టి.సుండుపల్లె 17, చెన్నూరు 15, సంబేపల్లె 15, చిట్వేలి 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ఎర్రగుంట్ల 13, చక్రాయపేట 12, వీఎనపల్లె 12, గాలివీడు 11, సిద్దవటం 11, వేంపల్లె 11, సింహాద్రిపురం 10, కలసపాడు 9, తొండూరు 9, చిన్నమండెం 7, సీకేదిన్నె 6, మైదుకూరు 6, పుల్లంపేట 6, వీరబల్లి 6, బి.కోడూరు 5, ఎల్‌ఆర్‌ల్లె 5, కాశినాయన 5, చాపాడు 4, ఖాజీపేట 4, ముద్దనూరు 4, పెండ్లిమర్రి 4, రాజుపాలెం 4, రామాపురం 4, బి.మఠం 3, దువ్వూరు 3, కొండాపురం 3, మైలవరం 3, వల్లూరు 2, అదర్‌ డిసి్ట్రక్ట్‌ 2, అట్లూరు 1, గోపవరం 1 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-05-18T05:23:42+05:30 IST