వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు భూసేకరణ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T06:03:48+05:30 IST

జగ్గయ్యపేట నియోజకవర్గంలో 36,800 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోత పథకం పనులు ప్రారంభిం చేందుకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు  భూసేకరణ పూర్తి చేయాలి
అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడి

జగ్గయ్యపేట, డిసెంబరు 3: జగ్గయ్యపేట నియోజకవర్గంలో 36,800 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోత పథకం పనులు ప్రారంభిం చేందుకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం జగ్గయ్యపేట పురపాలక సంఘ కౌన్సిల్‌  హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ నరసింహమూర్తి మాట్లాడుతు 26కి.మీ. పైపులైన్‌ను వేయాల్సి ఉందని, అధికభాగం ఎన్‌ఎస్పీ కాల్వ వెంబడి సమాంతరంగాపైపులైన్‌ వస్తుందని, 8 కిలోమాటర్ల మేర జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో వేదాద్రి, రావిరాల, జయంతిపురం, తిరుమలగిరి, భీమవరం, మంగోలు గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి వస్తుందని వివరించారు. భూముల రీసర్వే ప్రాజెక్టును రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన తక్కెళ్లపాడులో త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు. అందుకు సిద్ధంగా గ్రామంలో రీసర్వే భూముల ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పురపాలకసంఘ కార్యాలయంలో రీసర్వే పైలట్‌ ప్రాజెక్టుపై కలెక్టర్‌ సమీక్షించారు. జేసీ మాధవీలత మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి తహసీల్దార్‌ను పంపుతామని, మిగిలిన అభ్యంతరం లేని భూముల రికార్డులు సిద్ధం చేయాలని, కొత్తల్యాండ్‌ సర్వే మ్యాప్‌, యూనిక్‌ కోడ్‌కు సంబంధించి గైడ్‌లైన్స్‌ త్వరలో ఇస్తామని తెలిపారు. సమీక్షలో జేసీ మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ ధ్యాన్‌చంద్ర, ఇరిగేషన్‌ ఎస్‌ఈ నరసింహమూర్తి, ఏడీ సూర్యారావు, తహసీల్దార్లు, సర్వే అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-04T06:03:48+05:30 IST