Abn logo
Sep 21 2021 @ 00:00AM

డిస్నీ కార్లతో గిన్నిస్‌ రికార్డుల్లోకి!

హాబీ అంటే కాలక్షేపానికి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ హాబీయే నలుగురిలో గుర్తింపు తెచ్చిపెడుతుంది. మెక్సికోకు చెందిన జార్జ్‌ ఏరియస్‌ విషయంలో అదే జరిగింది. ఏకంగా అతని హాబీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కేలా చేసింది. ఆ విశేషాలు ఇవి..



జార్జ్‌కు డిస్నీ కార్లు సేకరించడం హాబీ. 2006 నుంచి డిస్నీ కార్లు సేకరించడాన్ని హాబీగా పెట్టుకున్నాడు.

ఇప్పటి వరకు 1200 రకాల కార్లు సేకరించాడు. 


 ఒకరోజు జార్జ్‌ కూతురు డిస్నీ కారును కొనిపెట్టమని అడిగింది. అప్పటి నుంచి తను వాటిని సేకరించడం హాబీగా పెట్టుకున్నాడు. ఇంట్లో ప్రతి షెల్ఫ్‌లో, డిస్‌ప్లేలో డిస్నీ కార్లే కనిపిస్తాయి. 


 ఎంతో ముచ్చటపడి సేకరించిన డిస్నీ కార్లను చూడటానికి పిల్లలు తరచుగా వస్తుంటారట. అతని కలెక్షన్ల గురించి తెలుసుకున్న కార్ల డైరెక్టర్‌ బ్రియాన్‌ ఫీ అతని ఇంటిని సందర్శించాడట. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ జార్జ్‌ పేరు ఎక్కింది.


ప్రత్యేకం మరిన్ని...