పియానోతో రికార్డుల్లోకి..!

ABN , First Publish Date - 2021-03-13T05:06:24+05:30 IST

పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ హైదరాబాద్‌కు చెందిన జనీనా అమిన్‌ అలీ. పదమూడేళ్ల వయస్సులోనే పియానో వాయిస్తూ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది

పియానోతో రికార్డుల్లోకి..!

పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ హైదరాబాద్‌కు చెందిన జనీనా అమిన్‌ అలీ. పదమూడేళ్ల వయస్సులోనే పియానో వాయిస్తూ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది.

  • జనీనా తన సంగీత ప్రతిభతో గ్రేడెడ్‌ పరీక్షల్లో ఆర్‌ఎస్‌ఎల్‌ లెవెల్‌ 3 సర్టిఫికెట్‌ను పూర్తి చేసింది. గ్రేడ్‌ 8 పియానో, కీబోర్డు వాయించడంలో అద్భుతమైన పనితీరును కనబరిచి, ఆ పరీక్ష పాసైన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 
  • అంతేకాకుండా, జనీనా  ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించింది. భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమని అంటున్న జనీనాకు మనమూ అల్‌ ద బెస్ట్‌ చెబుదామా!

Read more