మత్తులో యువత

ABN , First Publish Date - 2021-12-06T04:58:33+05:30 IST

మారుతున్న స మాజంలో రోజురోజుకూ ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో కొంతమంది యువత సాంకేతికతను వాడుకొని అంతరిక్షం వైపు అడుగులు వేస్తుంటే.. మరికొందరు పెడదారులు పడుతూ భవిష్యత్తును మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస చేస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థితికి చే రుకోవాలనే తల్లిదండ్రుల కలలన్నీ కల్లలు చే స్తూ కన్నీరు మిగులుస్తున్నారు. అధికారి యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మత్తులో యువత
గంజాయి మత్తుకోసం ఉపయోగించే సామగ్రి ఇదే

ప్రతీ ఊరిలో బెల్టు షాపులు 

మారుమూల గ్రామాల్లో గంజాయి సాగు

రాచమార్గంగా మారిన ఆన్‌లైన్‌ షాపింగ్‌  

ఇటీవల ఎయిర్‌గన్‌ లభ్యం

అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్న దాబాలు

మద్యం మత్తులో బైక్‌ రేసింగ్‌లు

ఖానాపూర్‌, డిసెంబరు 5: మారుతున్న స మాజంలో రోజురోజుకూ ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో కొంతమంది యువత సాంకేతికతను వాడుకొని అంతరిక్షం వైపు అడుగులు వేస్తుంటే.. మరికొందరు పెడదారులు పడుతూ భవిష్యత్తును మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస చేస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థితికి చే రుకోవాలనే తల్లిదండ్రుల కలలన్నీ కల్లలు చే స్తూ కన్నీరు మిగులుస్తున్నారు. అధికారి యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

గల్లీ.. గల్లీకో బెల్టుషాపు..

యువత చెడిపోయేందుకు కాదేది అనర్హం అన్న చందంగా ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి. ప్రతీ పల్లెల్లో.. ప్రతీ గల్లీల్లో బెల్టుషాపులు వెలుస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగుతున్నా యి. తాజాగా డోర్‌డెలివరీల పేరిట మద్యం తాగే చోటుకే  పంపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇక దాబాలకు మాత్రం కొదు వే లేకుండా పోతోంది. నిర్మల్‌ జిల్లాకేంద్రం నుంచి మంచిర్యాల, మెట్‌పల్లి, ఆదిలాబాద్‌, బాసర, హైదరాబాద్‌ వెళ్లే రహదారుల వెంట అనేక సంఖ్యలో దాబాలున్నాయి. ముఖ్యంగా ఖానాపూర్‌ ప్రాంతంలో దాబాల ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడమే కాకుండా సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. 

ఎయిర్‌గన్‌ లభ్యంపై  ఊహాగానాలు..

ఖానాపూర్‌ మండలంలో గత ఏడాది కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటి వరకు సుమారు పదిమందికి పైగా యువకులు ప్రాణాలు కోల్పోయారు. మద్యం, గంజాయి మత్తుకు యువత బానిసకావడమే కారణమని భావిస్తున్నారు. తాజాగా సత్తన్‌పెల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటనచోటు చేసుకుంది. మితిమీరిన వేగం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ ఘటనస్థలంలో ఎయి ర్‌గన్‌ లభించడంపై విభిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువత ఎయిర్‌గన్‌లను వెంట ఉంచుకుని సంచరించాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఖానాపూర్‌ ప్రాంతంలో లాక్‌డౌన్‌ సమయం నుంచి యువత బైక్‌లపై హైదరాబాద్‌లాంటి పట్టణాలకు రా కపోకలు సాగిస్తున్నారు. వీరిలో కొందరు మారుమూల ప్రాంతాల నుం చి గంజాయి మొక్కలను సేకరించి హైదరాబాద్‌కు సప్లై చేస్తున్నారనే ప్రచారం ఉంది. గంజాయికి బానిసలైన కొంతమంది యువకులు తమ తోటి యువకులను సైతం దానికి బానిసలు చేస్తూ గంజాయి తెచ్చి విక్రయిస్తూ సొ మ్ము చేసుకుని జల్సాలు చేస్తున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో సై తం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నార ని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఎయిర్‌గన్‌ లభ్యమైన కొద్దిరోజుల్లోనే పెంబి మండలంలోని ఓ మారుమూల గ్రామమైన కొసగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడాలోని ఓ పంట చేనులో ఖానాపూర్‌ సీఐ అజయ్‌బాబు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించగా పలు గంజాయిమొక్కలు లభించడం కొసమెరుపు. 

గుప్పుమంటున్న గంజాయి మత్తు..

మద్యం మత్తుకే బానిసైన యువతలో ఇ ప్పుడు గంజాయి మత్తు కొత్త జోష్‌ను నింపుతోందని చెబుతున్నారు. దీనికోసం ఆన్‌లైన్‌ షాపింగ్‌లను వాడుకుని ఎంచక్కా పెడదారి పడుతున్నారు. ఈ దందాకు ఆన్‌లైన్‌ షాపిం గ్‌ రాచమార్గంగా మిరింది. ఆన్‌లైన్‌లో ఆయుఽ దాలు కొనుగోలు చేసేంత వరకు యువత వెళ్లారంటేనే వారిపై ఈ చెడు ప్రభావం ఏ మేరకు పడిందో తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో హు క్కా పాట్‌లను కొనుగోలు చేయడం, జిల్లాలో ని మారుమూల ప్రాంతాల నుంచి గంజాయి ని తెచ్చుకోవడం మత్తుకు బానిసలుగా మార డం పారిపాటిగా మారింది. ఖానాపూర్‌, పెం బి, కడెం, దస్తూరాబాద్‌ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో కొంతమంది గంజాయి బజ్జీలను తయారు చేసి యువతకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోం ది. ఈ మత్తులో మితిమీరిన వేగంతో రోడ్లపై బైక్‌లతో దూసుకెళ్తున్న యువకులు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది క్రితం ఖానాపూర్‌ మండలంలోని తర్లాపాడ్‌, సత్తన్‌పెల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం సైతం ఇదే కోవకు చెందినదని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. 

గంజాయి కేసులు నమోదు..

ఇటీవల జిల్లాలో గంజాయి కేసులు నమోదు అయ్యాయి. గత నెలలో పెంబి మండలం రావిగూడా, సారంగాపూర్‌ మండలం రాంసింగ్‌తండా, బండరేవు తండాలలోని పొలాల్లో గంజాయి సాగు చేస్తూ పలువురు పట్టుబడ్డారు. గతనెల 20న ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మం డలానికి చెందిన ఇద్దరు నిర్మల్‌లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడడం, తాజాగా శనివారం సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలానికి చెందిన ఇద్దరు గంజాయిని తరలిస్తూ కంటపడ్డారు. వీరు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించి బైక్‌ వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు నిజామాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలా అనేకంగా కేసులు నమోదు అవుతున్నాయి.

Updated Date - 2021-12-06T04:58:33+05:30 IST