Apr 14 2021 @ 08:36AM

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 28..ఇంట్రెస్టింగ్ టైటిల్‌?

రీసెంట్‌గా ‘వ‌కీల్‌సాబ్‌’తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో పాటు, సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అయ్యప్పనుమ్ కోశియమ్‘ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవర్‌స్టార్‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు ‘సంచారి’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.