మహారాష్ట్రలో రూ.2 కోట్లతో పట్టుబడ్డ..తునికాకు కాంట్రాక్టర్లు

ABN , First Publish Date - 2020-06-05T10:49:55+05:30 IST

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో తెలం గాణకు చెందిన ఇద్దరు తునికాకు కాంట్రాక్టర్లు రూ.2 కోట్ల 19

మహారాష్ట్రలో రూ.2 కోట్లతో పట్టుబడ్డ..తునికాకు కాంట్రాక్టర్లు

మావోయిస్టులకు ఇవ్వడానికే తీసుకెళ్తున్నారని పోలీసుల అనుమానం

సిర్వంచ పోలీస్‌స్టేషన్‌లో విచారణ

 

మంచిర్యాల, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని గడ్చిరోలిలో తెలం గాణకు చెందిన ఇద్దరు తునికాకు కాంట్రాక్టర్లు రూ.2 కోట్ల 19 లక్షలతో అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా కాళేశ్వరం బ్రిడ్జిపైన వరంగల్‌కు చెందిన కాంట్రాక్టర్‌ గౌస్‌ వద్ద రూ.కోటి 20 లక్షలు, మంచిర్యాలకు చెందిన నారాయణరెడ్డి అనే కాంట్రా క్టర్‌ వద్ద రూ.99 లక్షలు పట్టుబడ్డాయి. మంచిర్యాల కాంట్రాక్టర్‌ నగదుకు సంబంధించిన రశీదు లను సమర్పించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు డబ్బులివ్వడానికి వెళ్తున్నా రనే అనుమానంతో పోలీసులు వీరిని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం వరకు కూడా వీరు సిర్వంచ పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. ఇంకా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-05T10:49:55+05:30 IST