మహేష్‌ బ్యాంక్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-01-27T02:51:50+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేష్‌ బ్యాంక్‌ కేసులో

మహేష్‌ బ్యాంక్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేష్‌ బ్యాంక్‌ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 10 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. మహేష్‌ బ్యాంకులోని మూడు కరెంట్‌ అకౌంట్ల వివరాలపై ఆరా తీశారు. మూడు ఖాతాల నుంచే రూ.12.40 కోట్లను సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. శాన్విక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్తాన్‌ ట్రేడర్స్‌, షానవాజ్‌ బేగం పేర్లతో కరెంట్ అకౌంట్లు ఉన్నాయి. సిద్దంబర్‌బజార్‌, హుస్సెనీఆలం, అత్తాపూర్‌లలో నేరగాళ్లు అకౌంట్లు తెరిచారు. ముంబైకి చెందిన ఓ మహిళతో సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌ ఖాతాలు తెరిపించారు. ఈ పనికి హుస్సెనీఆలంలోని ఓ వ్యాపారవేత్తను ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


అయితే పోలీసులకు ముగ్గురు ఖాతాదారులు అందుబాటులో లేరు. అమెరికా, కెనడాల నుంచి హ్యాక్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. నేరగాళ్లు ప్రాక్సీ అకౌంట్ల ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. ఐపీలను గుర్తించే పనిలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఉన్నారు. 20 బ్యాంకుల్లోని 127 ఖాతాలను స్తంభింపజేయాలంటూ సీసీఎస్‌ లేఖలు రాసింది. 


Updated Date - 2022-01-27T02:51:50+05:30 IST