Advertisement
Advertisement
Abn logo
Advertisement

రియల్టర్ విజయ్‌భాస్కర్ హత్యకేసులో కొనసాగుతున్న విచారణ

నెల్లూరు: రియల్టర్ విజయ్‌భాస్కర్ హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. నెల్లూరు బాబా త్రిలోక్‌నాథ్‌రెడ్డి అక్రమాలను పోలీసులు వెలికితీస్తున్నారు. పూజల పేరుతో వందలమందిని బాబా బురిడీ కొట్టించాడు. మాజీ ఆర్మీ అధికారి మల్లేష్‌తో కలిసి బాబా అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఆర్మీ అధికారితో బెదిరింపులకు దిగేవాడిని పేర్కొన్నారు. త్రిలోక్‌నాథ్‌రెడ్డితో సుధాకర్ అనే మరో భక్తుడు అత్యంత సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. సుధాకర్‌, మల్లేష్‌, బాబా త్రిలోక్‌నాథ్‌రెడ్డి కలిసి అక్రమాలు, మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సుధాకర్‌ భార్యపై రియల్టర్ విజయ్‌భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ప్లాన్ ప్రకారమే రియల్టర్‌ను మల్లేష్‌, సుధాకర్ హత్యచేశారని, హత్యచేసి డెడ్‌బాడీని బాబా ఇంటికి నిందితులు తీసుకెళ్లారని పోలీసులు చెబతున్నారు. విజయ్‌భాస్కర్ మృతదేహాన్ని కాల్చివేయాలని బాబా డబ్బులిచ్చినట్లు చెబుతున్నారు. నలుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
Advertisement