కర్ణాటకలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-08-05T07:41:52+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా గత 4 నెలల వ్యవధిలో కర్ణాటకలో రూ.27 వేల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులకు ఆమోదం

కర్ణాటకలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

  • వెల్లడించిన భారీ పరిశ్రమల శాఖ మంత్రి జగదీశ్‌శెట్టర్‌

బెంగళూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా గత 4 నెలల వ్యవధిలో కర్ణాటకలో రూ.27 వేల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్టు ఆ రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జగదీశ్‌శెట్టర్‌ ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24 నుంచి ఇంత వరకు 101 కంపెనీలకు అనుమతి ఇచ్చామని తద్వారా రానున్న మూడేళ్లలో 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ, ఔషధాల తయారీ, ఇంధనం, ప్లాస్టిక్‌, వ్యవసాయ, ఆహార శుద్ధి, ఆటోమొబైల్‌ విడి పరికరాలు, రెడిమేడ్‌ గార్మెంట్స్‌, లాజిస్టిక్స్‌, ఇంజనీరింగ్‌, రసాయన ఉత్పత్తులు, ఏరోస్పేస్‌ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకొచ్చాయన్నారు.      

Updated Date - 2020-08-05T07:41:52+05:30 IST