పెట్టుబడికి ప్రాపర్టీ!

ABN , First Publish Date - 2020-06-18T06:24:33+05:30 IST

పెట్టుబడి కోసం ఎక్కువ మంది ఎంచుకువాలనుకుంటోంది స్థిరాస్తినేనని హౌసింగ్‌ డాట్‌ కామ్‌, నరెడ్కో సంయుక్త సర్వే నివేదిక పేర్కొంది. అయితే, ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో దాదాపు 50 శాతం మంది ఇప్పటికీ అద్దెకుంటున్నారని సర్వే వెల్లడించింది...

పెట్టుబడికి ప్రాపర్టీ!

  • హౌసింగ్‌.కామ్‌, నరెడ్కో సర్వేలో 35 శాతం మంది అభిమతమిదే.. 


పెట్టుబడి కోసం ఎక్కువ మంది ఎంచుకువాలనుకుంటోంది స్థిరాస్తినేనని హౌసింగ్‌ డాట్‌ కామ్‌, నరెడ్కో సంయుక్త సర్వే నివేదిక పేర్కొంది. అయితే, ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో దాదాపు 50 శాతం మంది ఇప్పటికీ అద్దెకుంటున్నారని సర్వే వెల్లడించింది. ఇప్పటికీ ఫ్లాట్ల ధరలు అందుబాటులో లేవని వారు భావిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని 8 నగరాల్లో, ఏప్రిల్‌-మే నెలల్లో సంస్థ ఈ సర్వే జరిపింది. ఇళ్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్న 3,000 మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 



 ఎంతమంది.. ఎందులో పెట్టుబడి?

  1. 35శాతం   రియల్‌ ఎస్టేట్‌ 
  2. 28శాతం   బంగారం 
  3. 22శాతం   ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 
  4. 16శాతం   షేర్లు 


మరో ఆర్నెల్లింతే.. 

59శాతం -మరో ఆర్నెళ్లపాటు ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు. లేదా కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. 

53శాతం-కొత్త ఇళ్లు వెతుకులాటను ఆర్నెల్లు వాయిదా వేసుకున్నవారు


నిర్మాణం పూర్తయిన గృహమైతే మేలు.. 

సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నవారేనని హౌసింగ్‌.కామ్‌ వెల్లడించింది. వారంతా 25-45 ఏళ్లవారేనని, ఎక్కువ మంది నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారని తెలిపింది. గృహ ప్రవేశానికి మరో 6 నెలలు ఆగడానికి సిద్ధంగా ఉన్నవారు 60 శాతం కాగా.. 21 శాతం మంది ఏడాదైనా ఫర్వాలేదంటున్నారు. 


ఫ్లాట్‌ కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారు ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త ధోరణిని కనబరుస్తున్నప్పటికీ భవిష్యత్‌పై ఆశావహంగా ఉన్నారని సర్వే సూచిస్తోంది. ద్రవ్య కొరత, కరోనా అనిశ్చితి కారణంగా ఇళ్లు కోసం వెతుకులాటను ప్రస్తుతానికి నిలిపివేసినప్పటికీ మున్ముందు నెలల్లో చాలామంది ప్రయత్నాలను మళ్లీ మొదలు పెట్టనున్నారు.  

- ధ్రువ్‌ అగర్వాలా, హౌసింగ్‌. కామ్‌ గ్రూప్‌ సీఈఓ 


ఈ మధ్యకాలంలో స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమవడం, సూచీలు తీవ్ర ఊగిసలాటలకు లోనవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పెట్టుబడులకు చాలామంది రియల్‌ ఎస్టేట్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో ఇళ్లు కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేసుకున్నారు. అయిన్పటికీ మార్కెట్లో డిమాండ్‌ నెమ్మదిగా పెరుగుతోంది. 

- నిరంజన్‌ హీరానందిని, నరెడ్కో ప్రెసిడెంట్‌  


Updated Date - 2020-06-18T06:24:33+05:30 IST