‘సిప్‌’ పెట్టుబడులకు మంచి తరుణం

ABN , First Publish Date - 2020-03-30T09:00:38+05:30 IST

కరోనా దెబ్బతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో షేర్ల ధరలు దిగివచ్చాయి కాబట్టి ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని మార్కెట్‌ నిపుణులు సలహా...

‘సిప్‌’ పెట్టుబడులకు మంచి తరుణం

  • హెల్త్‌కేర్‌, టెలికాం బెస్ట్‌


న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో షేర్ల ధరలు దిగివచ్చాయి కాబట్టి ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని మార్కెట్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. దీర్ఘకాలిక దృక్పథంలో క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్‌) ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ, టెలికాం రంగాలు మంచి పనితీరును కనబరచవచ్చని భావిస్తున్నారు. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చని నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ, సీఈఓ సందీప్‌ సిక్కా తెలిపారు. దీర్ఘకాలిక దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించవచ్చని యెస్‌ ఏఎం సీ సీఈఓ కన్వార్‌ వివేక్‌ సూచిస్తున్నారు. అశికా వెల్త్‌ అడ్వైజర్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అమిత్‌ జైన్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. స్టాక్‌ మార్కెట్లలో పె ట్టుబడులకు బేర్‌ మార్కెట్లు మంచి సమయమన్నారు.

Updated Date - 2020-03-30T09:00:38+05:30 IST