డీవీఎంసీ కమిటీ సభ్యత్వం కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-01-23T06:25:11+05:30 IST

జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ(డీవీఎంసీ)లో సభ్యత్వం కోసం ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాజ్యలక్ష్మి ఒక ప్రకటన లో కోరారు.

డీవీఎంసీ కమిటీ సభ్యత్వం కోసం దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు, జనవరి 22: జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ(డీవీఎంసీ)లో సభ్యత్వం కోసం ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాజ్యలక్ష్మి ఒక ప్రకటన లో కోరారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పౌర హక్కుల అమలు, అత్యాచార నిరోధక చట్టం అమలు కోసం జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ కొత్త సభ్యులను నియామకం చేయాలని ప్రభుత్వం కోరిందన్నారు. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఐదుగురు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఇతర వర్గాలకు చెందిన ముగ్గురిని నియమించనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకునే వారు పౌర హక్కులు, అత్యాచార నిరోధక చట్టం అమలులో అనుభవం కలిగి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పనిచేసిన వారై ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ఇది వరకు ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన సేవా కార్యక్రమాల ఆధారాలతో పాటు ఫొటోలు, బయోడేటాను జత చేసి ఈనెల 31వ తేదీలోగా సాంఘిక సంక్షేమశాఖ, అంబేడ్కర్‌ భవన్‌, కలెక్టరేట్‌  అనే చిరునామాకు దరఖాస్తు చేర్చాలని డీడీ రాజ్యలక్ష్మి కోరారు. 

Updated Date - 2022-01-23T06:25:11+05:30 IST