కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవానికి కేసీఆర్‌..!

ABN , First Publish Date - 2020-08-13T15:31:23+05:30 IST

దుర్గం చెరువు కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా చేయించాలనే ఆలోచన మంత్రి కేటీఆర్‌కు ఉందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. సీఎంను రావాలని కోరుతున్నారని,

కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవానికి కేసీఆర్‌..!

రావాలని కోరాం: మేయర్‌ బొంతు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): దుర్గం చెరువు కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా చేయించాలనే ఆలోచన మంత్రి కేటీఆర్‌కు ఉందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. సీఎంను రావాలని కోరుతున్నారని, ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. బుధవారం దుర్గం చెరువుపై కేబుల్‌ వంతెనను మేయర్‌ పరిశీలించారు. వంతెన పురోగతిని, పెండింగ్‌ పనుల వివరాలు తెలుసుకున్నా రు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ వైపు నుంచి ఐటీ కారిడార్‌కు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు వీలుగా దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో కేబుల్‌ స్టే బ్రిడ్జి నిర్మించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45లో రూ.150 కోట్లతో నిర్మించిన వంతెనపై నుంచి బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ నుంచి కేబుల్‌ వంతెన మీదుగా ఐటీ కా రిడార్‌కు చేరుకోవచ్చు. వాహనాల రాకపోకలతోపాటు పర్యాటకహబ్‌గా వంతెనను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా రూ.4.2 కోట్లతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. రూ.9 కోట్లతో విద్యుదీకరణ పనులు చేయాల్సి ఉంది. ఈ పనుల్లో జాప్యంతోనే  ప్రారంభోత్సవం పెండింగ్‌లో ఉంది. 


123 కోట్లతో 50 థీమ్‌ పార్క్‌లు.. 

ఆహ్లాదంతోపాటు ఆరోగ్యకర వాతావరాణాన్ని అందించేందుకు నగరంలో రూ. 123 కోట్లతో 50 థీమ్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపా రు. కాప్రా సర్కిల్‌లోని ఏఎ్‌సరావునగర్‌, కుషాయిగూడ వాసవీ ఎన్‌క్లేవ్‌, చర్లపల్లి ఈసీనగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, హెచ్‌బీకాలనీ బండబావి, మల్లాపూర్‌లో మెత్తం రూ. 16.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఆరు థీమ్‌ పార్కులకు బుధవారం  శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి, యూబీడీ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ క్రిష్ణ, జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి. డీసీ శైలజ, తదితరులు 

పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T15:31:23+05:30 IST