Abn logo
Oct 23 2021 @ 23:13PM

నరవ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఈనెల 26వ తేదీ గడువు

29వ తేదీన కౌన్సెలింగ్‌

విశాఖపట్నం, అక్టోబరు 23:  విశాఖ నగరం  కంచరపాలెం పాత ఐటీఐ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ నరవ ఐటీఐ (ఎల్‌డబ్ల్యూఈ) నందు 2021-22 విద్యాసంవత్సరానికి గాను సీట్లు భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సిహెచ్‌.సునీల్‌కుమార్‌ తెలిపారు. అభ్యర్థులు ఐటీఐ.నిక్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 26వ తేదీ సాయం త్రం ఐదు గంటలలోపు అందజేయాలని సూచించారు.


ఎలక్ట్రీషియన్‌, ఎలక్ర్టానిక్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఆర్‌ అండ్‌ ఏసీ తదితర ట్రేడులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ధ్రువపత్రాల పరిశీలనకు జిల్లాలో ఏదైనా ప్రభుత్వ ఐటీఐ నందు హాజరుకావచ్చునని తెలి పారు. ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ఈనెల 29వ తేదీన ఉంటుందని చెప్పారు.