రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-09-18T06:53:35+05:30 IST

రైతునేస్తం 16వ వార్షికోత్సవం సందర్భంగా దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష ...

రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

రైతునేస్తం 16వ వార్షికోత్సవం సందర్భంగా దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్‌- ఎలక్ట్రానిక్‌ మీడియాలకు చెందిన వ్యవసాయ జర్నలిస్టులు, విస్తరణాధికారులతో పాటు అగ్రి ఇన్నోవేషన్సను అవార్డులతో సత్కరించనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


కరోనా కష్టాకాంలో అన్ని రంగాలు కుదేలైనప్పటికీ వ్యవసాయరంగం ఒక్కటే అభివృద్ధి సాధించింది. రైతుల ఆరుగాలం శ్రమకు శాస్త్రీయ విజ్ఞానం అండగా, విస్తరణ సేవలు చేదోడువాదోడుగా ఉంటూ దేశ ఉత్పతికి భరోసాగా నిలిచాయి. ఎప్పటి నుంచో రైతునేస్తం పురస్కారాలు అందిస్తున్నప్పటికీ వ్యవసాయంతో ముడిపడిన వారిని ఈసారి గౌరవించడానికి ప్రత్యేకత ఉందని భావిస్తున్నాం. 


దరఖాస్తు ఫారాలను రైతునేస్తం వెబ్‌సైట్‌ https://rythunestham.in నుంచి డౌనలోడ్‌ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తుకు తమ పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరిచి సెప్టెంబర్‌ నెల 30 తేదీలోగా పంపించాలి. ఎడిటర్‌, రైతునేస్తం, 62959, దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌- 500004 లేదా రైతునేస్తం, డోర్‌ నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్‌, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ -522 017 చిరునామాలకు దరఖాస్తులు పంపించాలి. రైతునేస్తం వార్షికోత్సవం అక్టోబర్‌లో ప్రముఖుల సమక్షంలో నిర్వహించబడుతుంది.

డా. యడ్లపల్లి వెంకటేశ్వరరావు

చైర్మన్‌, రైతునేస్తం ఫౌండేషన్‌

Updated Date - 2020-09-18T06:53:35+05:30 IST