Abn logo
Apr 9 2021 @ 00:01AM

భద్రాద్రి రామయ్య కల్యాణానికి రండి

సీఎం, దేవాదాయ శాఖ మంత్రిని ఆహ్వానించిన దేవస్థానం ఈవో

భద్రాచలం, ఏప్రిల్‌ 8: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 21న నిర్వహించే సీతారామచంద్రుల కల్యాణానికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని దేవస్థానం ఈవో బి.శివాజీ గురువారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం తరపున జ్ఞాపికను, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. అదేవిధంగా ఎంపీలు మాలోత్‌ కవిత, సంతోష్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా ఆహ్వానించారు. ఆహ్వానం పలికేందుకు వెళ్లిన వారిలో దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు నిరంజన్‌ కుమార్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేద పండితులు చిట్టి హనుమత్‌శాస్త్రి, ముఖ్య అర్చకులు కె.శ్రవణకుమారాచార్యులున్నారు.

Advertisement
Advertisement