Abn logo
Apr 16 2021 @ 23:57PM

మండల పరిషత్తు సమావేశాలకు పీఏసీఎస్‌ అధ్యక్షులకు ఆహ్వానం

  • ప్రోటోకాల్‌ వర్తింపు ఉత్తర్వులు జారీచేసిన పీఆర్‌ఆర్డీ కమిషనర్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : మండల ప్రజాపరిషత్తు సమావేశాలకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) అధ్యక్షులను ఆహ్వానించాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.రఘనందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. మండల ప్రజా పరిషత్తు సమావేశాలకు పీఏసీఎస్‌ అధ్యక్షులను ఆహ్వానించాలని ఉత్తర్వులు ఉన్నా కొందరు పాటించడం లేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కమిషనర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో పీఏసీఎస్‌ అధ్యక్షులకు మండల ప్రజా పరిషత్తు సమావేశాలకు ఆహ్వానం అందడంతో పాటు జరిగే కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్‌ వర్తించనుంది.

Advertisement
Advertisement