పరిశోధనా పత్రాలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-30T08:27:53+05:30 IST

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు; నెచ్చెలి అంత ర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యూ.ఎస్‌.ఏ సంయుక్తంగా...

పరిశోధనా పత్రాలకు ఆహ్వానం

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు; నెచ్చెలి అంత ర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యూ.ఎస్‌.ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్‌ ‘అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)’ 2021 జనవరి 19, 20, 21 తేదీల్లో జరుగుతుంది. సదస్సులో పాల్గొనేవారు నిర్ణయించిన అంశాలలో నచ్చిన ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు. పత్రాన్ని అను-7, ప్రియాంక ఫాంట్‌ 18, లైన్‌ స్పేస్‌ 21తో పేజ్‌ మేకర్‌ ఫైల్‌తోపాటు తప్పనిసరిగా యూనికోడ్‌వర్డ్‌ ఫైల్‌ కూడా పంపాలి. అంశాలు, సదస్సు ఇతర వివరాలను తెలుసుకోగోరేవారు కె. ఆశాజ్యోతి (94496 72394)ని, లేదా ఈమెయిల్‌: ్ట్ఛజూఠజఠఠ్ఛీఛ2021ఃజఝ్చజీజూ.ఛిౌఝ లోగాని  సంప్రదించవచ్చు. పరిశోధన ఇదే మెయిల్‌ ఐడికి డిసెంబరు 25లోగా పంపాలి. 

కె. గీత

Updated Date - 2020-11-30T08:27:53+05:30 IST