ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-01-24T06:36:57+05:30 IST

తాడేపల్లిగూడేనికి చెందిన దివంగత పాత్రికేయుడు యద్దనపూడి సూర్యనారాయణమూర్తి స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారం–2021 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అవార్డు కమిటీ కన్వీనర్‌ డి. సోమసుదర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 23: తాడేపల్లిగూడేనికి చెందిన దివంగత పాత్రికేయుడు యద్దనపూడి సూర్యనారాయణమూర్తి స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారం–2021 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అవార్డు కమిటీ కన్వీనర్‌ డి. సోమసుదర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 జనవరి 1 నుంచి డిసెంబరు 31 లోపు ప్రచురితమైన వార్తలు, కథనాల జిరాక్స్‌ కాపీలను ఎంట్రీగా కవరింగ్‌ లెటర్‌తో తమకు అందించాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి క్షేత్ర స్థాయిలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.   పూర్తి వివరాలకు ఫోన్‌ నంబరు 98660 74026లో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2022-01-24T06:36:57+05:30 IST