చైనా కంపెనీకి గుడ్‌బై

ABN , First Publish Date - 2021-06-10T10:09:03+05:30 IST

చైనా స్పోర్ట్స్‌ వేర్‌ కంపెనీ లీ నింగ్‌తో ఒప్పందానికి భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) బైబై చెప్పింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత అథ్లెట్లు ధరించే కిట్‌ కోసం కొత్త స్పాన్సరర్‌ను వెతికే పనిలో పడింది ఐఓఏ...

చైనా కంపెనీకి గుడ్‌బై

  • కొత్త కిట్‌ స్పాన్సర్‌ వేటలో ఐఓఏ

న్యూఢిల్లీ: చైనా స్పోర్ట్స్‌ వేర్‌ కంపెనీ లీ నింగ్‌తో ఒప్పందానికి భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) బైబై చెప్పింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత అథ్లెట్లు ధరించే కిట్‌ కోసం కొత్త స్పాన్సరర్‌ను వెతికే పనిలో పడింది ఐఓఏ. వాస్తవానికి లీ నింగ్‌ కంపెనీతో ఐఓఏ ఒప్పందం టోక్యో క్రీడల తర్వాత ముగియాలి. ఆరురోజుల క్రితమే లీ నింగ్‌ డిజైన్‌ చేసిన ఒలింపిక్‌ కిట్‌ను కూడా ఆవిష్కరించారు. అయితే, గతేడాది లద్దాఖ్‌లో భారత సైనికులపై చైనా ఘర్షణకు దిగడంతో అప్పటినుంచి డ్రాగన్‌ దేశంపై ఆంక్షలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐఓఏ ఒలింపిక్‌ కిట్‌పై విమర్శలు తలెత్తాయి. దీంతో దిగొచ్చిన ఐఓఏ.. మన దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చైనా కంపెనీ లీ నింగ్‌తో స్పాన్సర్‌షి్‌పను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈనెలాఖరులోగా కొత్త కిట్‌ స్పాన్సర్‌ను చూసుకుంటామనీ, ఆలోపు స్పాన్సర్‌ దొరకకపోతే భారత అథ్లెట్లు అన్‌ బ్రాండెడ్‌ దుస్తులనే టోక్యోలో ధరిస్తారని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా బుధవారం వెల్లడించారు. 

Updated Date - 2021-06-10T10:09:03+05:30 IST