ఐఫోన్‌ 12 గ్లోబల్‌ ఫోన్‌

ABN , First Publish Date - 2020-11-28T09:24:28+05:30 IST

ఐఫోన్‌ 12 గ్లోబల్‌ ఫోన్‌. దీని తయారీలో ఐదారు దేశాల హస్తం ఉంది. అవును, నిజమే... ఐఫోన్‌ 12 అచ్చంగా ‘మల్టీ నేషనల్‌’. కాలిఫోర్నియాలో డిజైనింగ్‌, చైనాలో అసెంబ్లింగ్‌ జరిగినట్టు ఐఫోన్‌ బాక్స్‌లపైనే ముద్రిస్తారు. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో లోని వివిధ కాంపోనెంట్స్‌లో 26.8 శాతం మేర దక్షిణ కొరియాలో ఉత్పత్తి

ఐఫోన్‌ 12 గ్లోబల్‌ ఫోన్‌

ఐఫోన్‌ 12 గ్లోబల్‌ ఫోన్‌. దీని తయారీలో ఐదారు దేశాల హస్తం ఉంది. అవును, నిజమే... ఐఫోన్‌ 12 అచ్చంగా ‘మల్టీ నేషనల్‌’. కాలిఫోర్నియాలో డిజైనింగ్‌, చైనాలో అసెంబ్లింగ్‌ జరిగినట్టు ఐఫోన్‌ బాక్స్‌లపైనే ముద్రిస్తారు. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో లోని వివిధ కాంపోనెంట్స్‌లో 26.8 శాతం మేర దక్షిణ కొరియాలో ఉత్పత్తి అవుతున్నాయి. దీని డిస్‌ప్లేని దక్షిణకొరియాకు చెందిన రెండు జైంట్‌ కంపెనీలు ‘సామ్‌సంగ్‌’, ‘ఎల్‌జి’ అందిస్తున్నాయి. ఐఫోన్‌12లోని కెమెరాలోని సెన్సర్లను ‘సోనీ’ కంపెనీ ఇస్తోంది. జపాన్‌ కంపెనీలు 13.6 శాతం కాంపోనెంట్స్‌ను సమకూరుస్తున్నాయి. శబ్ద నియంత్రణ, సర్క్యూట్‌ పరిరక్షణ అలాగే మరికొన్ని కాంపోనెంట్స్‌ జపనీస్‌ కంపెనీల ఉత్పత్తులని ‘నికియా’ వెల్లడించింది. ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్లు చైనాలో అసెంబ్ల్‌ అవుతున్నప్పటికీ అక్కడి కాంపోనెంట్స్‌ చాలా తక్కువ. కాంపోనెంట్ల వివరాలను ఈ నివేదిక లోతుగా తెలియజేయలేదు. అయితే అమెరికా 21.6 శాతం, యూరప్‌లోని దేశాలు 21.9 శాతం, తైవాన్‌ 11.1 శాతం మేర కాంపోనెంట్లను అందిస్తున్నాయి. ఓలెడ్‌ డిస్‌ప్లేను క్యుపర్టినోలోని కంపెనీ ఇస్తోంది. ఈ విషయంలో మాత్రం శామ్‌సంగ్‌ ఆధిక్యం కనబరుస్తూ ఉండటం విశేషం.

Updated Date - 2020-11-28T09:24:28+05:30 IST