ఈవెంట్‌కు ముందే ఐఫోన్ 13 మోడల్ పిక్స్ వైరల్

ABN , First Publish Date - 2021-09-14T00:59:40+05:30 IST

బయటికి తెలిసిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 13లో నాలుగు మోడల్స్ రానున్నాయట. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో మోడల్స్ రానున్నాయట. 2406 ఎంఏహెచ్, 3095 ఎంఏహెచ్, 4352 ఎంఏహెచ్ బ్యాటరీ

ఈవెంట్‌కు ముందే ఐఫోన్ 13 మోడల్ పిక్స్ వైరల్

కాలిఫోర్నియా: ప్రతిరోజు ప్రపంచం అత్యంత అధునాతనంగా మారుతూనే ఉన్నాయి. గంటల వ్యవధిలో టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మొబైల్ మార్కెట్లో కూడా అనేక మార్పులు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రతి రోజు ఎన్ని అధునాతన ప్రొడక్ట్స్ వినియోగదారుల ముందుకు వచ్చినా వారి చూపంతా యాపిల్ ఉత్పత్తుల వైపే ఉంటుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహించే ఈవెంట్‌లో యాపిల్ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఈ యేడాది కూడా సెప్టెంబర్ 14న రాత్రి 10:30 గంటలకు (ఇండియన్ టైం) జరగనుంది. అయితే ఈ ఈవెంట్‌కు ముందే యాపిల్ విడుదల చేయబోయే ఐఫోన్ 13 సహా ఇతర ఉత్పత్తులు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.


బయటికి తెలిసిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 13లో నాలుగు మోడల్స్ రానున్నాయట. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో మోడల్స్ రానున్నాయట. 2406 ఎంఏహెచ్, 3095 ఎంఏహెచ్, 4352 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు విడుదల కానున్నాయట. ఈ ఫోన్లలో శాటిలైట్ కాలింగ్‌ అధునాతన ఫీచర్ అని చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా 1టీబీ స్టోరేజీతో ఐఫోన్ 13 రానుందట. 5.4 అంగుళాల నుంచి 6.7 అంగుళాల వరకు మొబైల్ డిస్‌ప్లేలు ఉండనున్నాయి. నాలుగు వేరియంట్లలో యాపిల్ ఏ15 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం.


వీటితో పాటు యాపిల్ వాచ్‌, యాపిల్ ఐపాడ్స్, యాపిల్ ఐపాడ్, యాపిల్ మ్యాక్ బుక్‌లు కూడా విడుదల చేయనున్నారట. కొత్తదనంతో పాటు టెక్నాలజీలో తనదైన మార్క్‌ను చూపించే యాపిల్.. ఈసారి వచ్చే ఉత్పత్తుల్లో కూడా ఆ వైవిధ్యాన్ని చూపించబోతున్నట్లు టెక్ నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-09-14T00:59:40+05:30 IST