Apple: చైనాపై ఆధారపడడం తగ్గిస్తున్న యాపిల్.. ఇండియాలోనే ‘ఐఫోన్14’

ABN , First Publish Date - 2022-08-06T01:19:15+05:30 IST

ఐఫోన్ తయారీ విషయంలో యాపిల్ వ్యూహం మార్చిందా? చైనాపై అధారపడడాన్ని తగ్గిస్తోందా? తాజా పరిణామాలు చూస్తుంటే

Apple: చైనాపై ఆధారపడడం తగ్గిస్తున్న యాపిల్.. ఇండియాలోనే ‘ఐఫోన్14’

న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీ విషయంలో యాపిల్ వ్యూహం మార్చిందా? చైనాపై అధారపడడాన్ని తగ్గిస్తోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానం కలగక మానదు. యాపిల్ ఐఫోన్ 14 (iPhone 14) సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి లాంచ్ చేయాలని ముహూర్తం పెట్టుకున్న యాపిల్ (Apple).. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను తీసుకొస్తోంది. ఈ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్లపై అప్పుడే రూమర్లు కూడా మొదలయ్యాయి. తాజాగా ఐఫోన్ 14కు సంబంధించి ఇండస్ట్రీ అనలిస్ట్ మింగ్ చి కువో (Ming-Chi Kuo) షేర్ చేసిన కొన్ని వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఐఫోన్ 14 మోడళ్లలో కొన్ని చైనాతోపాటు ఇండియాలోనూ తయారవుతున్నాయన్నదే ఆ న్యూస్. ఇటీవలి బౌగోళిక సమస్యల నేపథ్యంలో చైనీస్ సప్లై చైన్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


భారత్‌లో ప్రస్తుతం ఐఫోన్లను ఉత్పత్తి  చేస్తున్న ఫాక్స్‌కాన్(Foxconn) సైట్ చైనా తయారీదారులతో ఏకకాలంలో ఐఫోన్ 14 మోడళ్లను రవాణా చేసే పనిని తీసుకుంటుందని  కువో తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్‌లో ఐఫోన్ హ్యాండ్‌సెట్స్‌ను తయారుచేస్తోంది. అయితే, చైనా తయారీదారులతో పోలిస్తే ఇది పావువంతు మాత్రమే. భారత్‌లోని ఐఫోన్ తయారీ యూనిట్లు ఐఫోన్ 14 మోడల్స్‌ను అయిన 6.1 అంగుళాల డిస్‌ప్లే‌తో తయారు చేయాలని భావిస్తున్నాయి. ఇవి వెనిల్లా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రోగా తెలుస్తోంది. అలాగే, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు 6.7 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటాయని తెలుస్తోంది. 


ఇండియాలోని యాపిల్ ఉత్పత్తి సైట్ల ఎగుమతులు ప్రస్తుతానికి చైనా కంటే చాలా వెనకన ఉన్నాయిన కువో పేర్కొన్నారు. చైనాయేతర ఐఫోన్ ప్రొడక్షన్ సైట్లను ఏర్పాటు చేసుకోవడానికి యాపిల్‌కు ఇది ముఖ్యమైన మైలురాయి కాగలదని అభిప్రాయపడ్డారు. చైనాలోని తమ సప్లై చైన్‌పై భౌగోళిక సమస్యల ప్రభావం నుంచి తప్పించుకోవాలని చూస్తున్న యాపిల్.. తమ అభివృద్ధికి మరో కీలక ప్రాంతమైన భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోంది.  


Updated Date - 2022-08-06T01:19:15+05:30 IST