ఐఫోన్‌, ఐపాడ్‌ అప్‌డేట్‌ మస్ట్‌

ABN , First Publish Date - 2021-07-31T06:11:51+05:30 IST

యాపిల్‌ ఐఫోన్‌, ఐపాడ్‌ వినియోగదారులు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.

ఐఫోన్‌, ఐపాడ్‌ అప్‌డేట్‌ మస్ట్‌

యాపిల్‌ ఐఫోన్‌, ఐపాడ్‌ వినియోగదారులు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.  ఐఓఎస్‌ 14.7.1, ఐపాడ్‌ ఓఎస్‌ 14.7.1 డివైస్‌లు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’(సీఈఆర్‌టీ-ఇన్‌) చెబుతోంది. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ పరిఽధిలో ఈ సంస్థ పని చేస్తోంది. ప్రస్తుతం మొబైల్‌ పరంగా సాగుతున్న దోపిడీకి ఈ వెర్షన్లు అనువుగా ఉన్నందున వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలంది. ఐఫోన్‌ 6 ఎస్‌ ఆపై, ఐ పాడ్‌ ప్రొ అన్ని మోడల్స్‌, ఐ పాడ్‌ ఎయిర్‌ 2 ఆపై, ఐపాడ్‌ అయిదో జనరేషన్‌ ఆపై, ఐపాడ్‌ మినీ 4 ఆపై, ఐ పాడ్‌ టచ్‌(ఏడో జనరేషన్‌)పై ప్రభావం కనిపించింది. ఐపాడ్‌ ఐఓఎస్‌, యాపిల్‌ ఐఓఎస్‌ రెండూ అటాక్‌కు అనువుగా ఉన్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ పేర్కొంది. మెమరీ కరప్షన్‌, మెమరీ హ్యాండిలింగ్‌లో తప్పులే ఇందుకు కారణం. ఈ తరుణంలో అప్‌డేట్‌ కానిపక్షంలో అటాకర్లకు అవకాశం లభించినట్లేనని వివరించింది. 

Updated Date - 2021-07-31T06:11:51+05:30 IST