ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌!

ABN , First Publish Date - 2020-08-03T09:08:25+05:30 IST

ఈ ఏడాది ఐపీఎల్‌-13వ సీజన్‌కు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో జరిగే ఈ లీగ్‌ ఫైనల్‌ను నవంబరు...

ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌!

ఈ వారంలో అధికారిక అనుమతి

రాత్రి 7.30కే మ్యాచ్‌లు

నవంబరు 10నే ఫైనల్‌

 ముగిసిన పాలకమండలి భేటీ


న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌-13వ సీజన్‌కు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో జరిగే ఈ లీగ్‌ ఫైనల్‌ను నవంబరు 10న ఖరారు చేశారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి టోర్నీ నిర్వహణకు అనుమతి లభించడం దాదాపు ఖరారైంది. శనివారం క్రీడా శాఖ నుంచి అంగీకారం లభించగా.. మరో రెండు, మూడు రోజుల్లో కేంద్ర హోం, విదే శాంగ శాఖలు కూడా అధికారికంగా తమ సమ్మతి తెలపనున్నాయి. ఆదివారం వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా సమావేశమైన లీగ్‌ పాలక మండలి సభ్యులు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. ఇప్పటి వరకు తమతో కొనసాగుతున్న స్పాన్సర ర్లతోనే ముందుకు వెళ్లా లని భావి స్తున్నట్టు ఐపీఎల్‌ పాలకమం డలి సభ్యుడొకరు తెలిపారు. ఈ కరోనా సమయంలో ఇతర కంపెనీలను ఒప్పించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో టైటిల్‌ స్పాన్సరర్‌గా వివోనే ఉండబోతోంది. బయో బబుల్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్‌తో చర్చలు సాగుతున్నాయని, మెడికల్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు దుబాయ్‌కు చెందిన గ్రూప్‌ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు బోర్డు తెలిపింది.

10 డబుల్‌ హెడర్‌లు.. 24 మంది క్రికెటర్లు

ఈసారి ఐపీఎల్‌లో రాత్రి జరిగే మ్యాచ్‌లు 7.30 గంటలకే ఆరంభం కానున్నాయి. ఇప్పటి వరకు ఇవి రాత్రి 8.00 గంటల నుంచి జరగ్గా అరగంట ముందుకు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌, షార్జా, అబుదాబి వేదికలు కానున్నాయి. అలాగే డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ (ఒకేరోజు రెండు మ్యాచ్‌లు)లను కూడా 10కి పెంచారు. ‘53 రోజుల పాటు జరిగే ఐపీఎల్‌లో ఈ డబుల్‌ హెడర్స్‌ మధ్యాహ్నం 3.30కి.. రాత్రి మ్యాచ్‌లు 7.30కి ఆరంభవుతాయి’ అని బీసీసీఐ ప్రకటించింది. ఇక ఆయా జట్లలో ఆటగాళ్ల గరిష్ఠ సంఖ్యను 24కు పరిమితం చేశారు. నిజానికి పంజాబ్‌, హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్లకు మాత్రమే 25 మంది ఆటగాళ్లుండడంతో ఇదేమీ సమస్య కాబోదు. అయితే ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం ప్రేక్షకులను అనుమ తించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఆయా ఫ్రాంచైజీలను కూడా తమ క్రికెటర్ల వీసా ప్రక్రియను మొదలు పెట్టాల్సిందిగా సూచించారు.

ఎస్‌ఓపీ వచ్చేవారం..

లీగ్‌ను సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలో సూచించే సమగ్ర విధి విధానాల (ఎస్‌ఓపీ) జాబితా ఇంకా పూర్తి కాలేదు. ఇది వచ్చే పది రోజుల్లోగా అన్ని ఫ్రాంచైజీలకు అందిస్తామని బీసీసీఐ తెలిపింది. అలాగే టోర్నీ మధ్యలో ఆటగాళ్లెవరైనా కొవిడ్‌-19 బారిన పడితే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తీసుకునే విషయంలో పరిమితి లేదని స్పష్టం చేసింది.


పాలక మండలి ఆమోదించిన కీలక అంశాలివే

1. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్‌

2. 53 రోజులు (10 రోజులు.. రోజుకు2 మ్యాచ్‌లు)

3. జట్టులో గరిష్ఠంగా 24 మంది క్రికెటర్లకు అనుమతి

4. కొవిడ్‌-19 ప్రత్యామ్నాయ ఆటగాళ్లకు అనుమతి 

5. బయో బబుల్‌ ఏర్పాటుకు టాటా గ్రూప్‌తో చర్చలు 

6. టైటిల్‌ స్పాన్సరర్‌గా వివో కొనసాగింపు

7. మహిళల లీగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ 


Updated Date - 2020-08-03T09:08:25+05:30 IST