తాంబేపై ఐపీఎల్‌ అనర్హత వేటు

ABN , First Publish Date - 2020-02-28T09:56:09+05:30 IST

వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. బీసీసీఐ అనుమతి లేకుండా గతంలో ఓ ప్రైవేట్‌ లీగ్‌లో ఆడడంతో అతడిపై అనర్హత వేటు పడింది.

తాంబేపై ఐపీఎల్‌  అనర్హత వేటు

ముంబై: వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. బీసీసీఐ అనుమతి లేకుండా గతంలో ఓ ప్రైవేట్‌ లీగ్‌లో ఆడడంతో అతడిపై అనర్హత వేటు పడింది. 48 ఏళ్ల తాంబేను గతేడాది  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో వేలం చరిత్రలోనే అమ్ముడుపోయిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో రిటైర్మెంట్‌ ప్రకటించి వెనక్కి తీసుకున్న తాంబే.. బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండా దుబాయ్‌లో జరిగిన టీ10 లీగ్‌లో ఆడి నిబంధనలను ఉల్లంఘించాడు. 2013-16 మధ్య తాంబే ఐపీఎల్‌లో రాజస్థాన్‌, గుజరాత్‌, హైదరాబాద్‌ తరఫున మొత్తం 33 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీశాడు.

Updated Date - 2020-02-28T09:56:09+05:30 IST