Advertisement
Advertisement
Abn logo
Advertisement

IPL 2021: రాణించిన కోహ్లీ, పడిక్కల్.. చెన్నై ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యం

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. 41 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 6 ఫోర్లు, సిక్సర్‌తో 53 పరుగులు చేయగా, 50 బంతులు ఆడిన దేవదత్ పడిక్కల్ 5 ఫోర్లు మూడు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. డివిలియర్స్ 12, మ్యాక్స్‌వెల్ 11, టిమ్ డేవిడ్ 1, హర్షల్ పటేల్ 3 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు పడగొట్టగా, ఠాకూర్ 2, దీపక్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement