మార్చి చివరి వారంలో ఐపీఎల్ మొదలు: జై షా

ABN , First Publish Date - 2022-01-23T02:15:17+05:30 IST

ఐపీఎల్ 2022 ప్రారంభంపై సస్పెన్స్ వీడిపోయింది. మార్చి చివరి వారంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమై మేలో ముగియనున్నట్టు..

మార్చి చివరి వారంలో ఐపీఎల్ మొదలు: జై షా

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 ప్రారంభంపై సస్పెన్స్ వీడిపోయింది. మార్చి చివరి వారంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమై మేలో ముగియనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఫ్రాంచైజీల యజమానుల్లో చాలామంది టోర్నీని ఇండియాలోనే నిర్వహించాలని కోరారని పేర్కొన్నారు. అలాగే, ఈ సీజన్‌లో రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో వచ్చి చేరుతున్నట్టు చెప్పారు.


ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోబోమన్నారు. ఆటగాళ్ల భద్రత విషయంలో గతంలో ఎప్పుడూ రాజీపడలేదని గుర్తు చేసిన ఆయన.. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో ప్లాన్-బిపై పనిచేస్తున్నట్టు చెప్పారు. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12-13 రోజుల్లో జరుగుతుందని, అంతకుముందే వేదికలను ఖరారు చేస్తామని చెప్పారు.  


ఈసారి  మొత్తంగా 1,214 మంది ఆటగాళ్లు (896 మంది ఇండియన్స్, 318 మంది విదేశీయులు) మెగా వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 270 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా, 903 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు, 41 మంది అసోసియేటెడ్ ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు 27 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వేలానికి ముందు రెండు కొత్త ప్రాంచైజీలు చెరో ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.  

Updated Date - 2022-01-23T02:15:17+05:30 IST