ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-10-21T05:49:37+05:30 IST

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సీసీసీ నస్పూర్‌ కేం ద్రంగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రూ.1.4లక్షల స్వాధీనం

పట్టుబడిన వారిలో రియల్‌ వ్యాపారులు, ఉద్యోగులు


కోల్‌సిటీ/నస్పూర్‌, అక్టోబరు 20: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సీసీసీ నస్పూర్‌ కేం ద్రంగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15మందిని మంగళవారం అరెస్టు చేసినట్టు రామగుండం కమిషనరేట్‌ డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన  వివరాలను వెల్లడించారు. చెన్నై వర్సెస్‌ రాజస్థాన్‌ ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని కమిషనర్‌ సత్యనారాయణకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించామన్నారు. సీసీసీ నస్పూర్‌ ఏరియాలోని మదర్‌ క్లీనిక్‌, ప్లడ్‌ కాలనీల్లో దాడులు జరుపగా జాబ్రిఇక్బాల్‌, జాబ్రి హాద్రి, అఖి ల్‌, కొమ్మెర విజయ్‌, ఫహీం, సుంకరి సాగర్‌, అను మాస శరత్‌కుమార్‌, నేదూరి శ్రీనివాస్‌, అగ్గు కిర ణ్‌, అగ్గు స్వామి, చిట్యాల ప్రశాంత్‌, సూరిమల్ల కార్తీక్‌, చాతరాజు శరత్‌, మాచర్ల సాయి, కోట ఉద య్‌ ఉన్నారు. పట్టుబడినలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర చిరు వ్యాపారులు, రోజు వారీ కూలీలు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.1,40,800 నగదు, 16మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడే వారిపై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడే వారిని పక్కా ప్రణాళికలతో పట్టుకుంటామన్నారు.


ఈ బెట్టింగ్‌లతో యువత, రోజు వారీ కూలీలు సైతం తీవ్రంగా నష్టపోతున్నారని, బెట్టింగ్‌ నిర్వాహకులను వదిలిపెట్టేది లేదన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ ఏసీపీ పీవీ గణేష్‌, ఇన్‌స్పెక్టర్‌ రమణబాబు, నస్పూర్‌ సీఐ కుమారస్వామి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు ఏ వెంకటేశ్వర్లు, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ బీ స్వామి, ఎస్‌బీఐ నారాయణ, నస్పూర్‌ ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి, సీసీఎస్‌, మం చిర్యాల ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, మహేందర్‌, అశోక్‌, ఇసాక్‌ అలీ, బీ అశోక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T05:49:37+05:30 IST