Abn logo
Sep 26 2021 @ 00:52AM

ఢిల్లీ టాప్‌ గేర్‌

  • 33 పరుగులతో రాజస్థాన్‌పై గెలుపు
  • సంజూ అర్ధ శతకం వృథా

అబుధాబి: జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఐపీఎల్‌ ప్లేఆ్‌ఫ్సకు దాదాపుగా చేరుకొంది. బౌలర్లు రాణించడంతో ఓ మాదిరి స్కోరును ఢిల్లీ కాపాడుకోగలిగింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 33 పరుగుల తేడాతో నెగ్గింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ 8 విజయాలతో మొత్తం 16 పాయింట్లతో మళ్లీ టాప్‌నకు చేరుకొంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 154/6 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ శ్రేయాస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 43) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెట్‌మయర్‌ (28), కెప్టెన్‌ పంత్‌ (24) సహకారం అందించారు. ఓపెనర్లు పృథ్వీ (10), ధవన్‌ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా.. అయ్యర్‌, పంత్‌ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడిం చి ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. ఛేదనలో రాజస్థాన్‌ ఓవర్లన్నీ ఆడి 121/6 పరుగులు చేసి ఓడిం ది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (53 బంతుల్లో 70 నాటౌట్‌) పోరాటం వృథా అయింది. 6 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్లను కోల్పోయిన రాజస్థాన్‌.. ఏ దశలోనూ పోటీ ఇచ్చే విధంగా కనిపించలేదు. 


శాంసన్‌కు రూ. 24 లక్షల జరిమానా

స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రాజస్థాన్‌ సారథి సంజూ శాంసన్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో రాయల్స్‌ ఇలా నిబంధనలు ఉల్లంఘించడం ఇది రెండోసారి. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ నిర్ణీత సమయంలో తగినన్ని ఓవర్లు వేయలేక పోవడంతో  శాం సన్‌కు రూ. 12 లక్షల ఫైన్‌ వేశారు. 



స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) లివింగ్‌స్టోన్‌ (బి) సకారియా 10, ధవన్‌ (బి) త్యాగి 8, శ్రేయాస్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తెవాటియా 43, రిషభ్‌ పంత్‌ (బి) ముస్తాఫిజుర్‌ 24, హెట్‌మయర్‌ (సి) సకారియా (బి) ముస్తాఫిజుర్‌ 28, లలిత్‌ యాదవ్‌ (నాటౌట్‌) 14, అక్షర్‌ పటేల్‌ (సి) మిల్లర్‌ (బి) సకారియా 12, అశ్విన్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 154/6; వికెట్ల పతనం: 1-18, 2-21, 3-83, 4-90, 5-121, 6-142; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 4-0-22-2, మహిపాల్‌ లోమ్రర్‌ 1-0-5-0, సకారియా 4-0-33-2, కార్తీక్‌ త్యాగి 4-0-40-1, షంసీ 4-0-34-0, తెవాటియా 3-0-17-1. 


రాజస్థాన్‌: లివింగ్‌స్టోన్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ 1, యశస్వి (సి) పంత్‌ (బి) నోకియా 5, శాంసన్‌ (నాటౌట్‌) 70, మిల్లర్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 7, లోమ్రర్‌ (సి) అవేశ్‌ (బి) రబాడ 19, పరాగ్‌ (బి) అక్షర్‌ 2, తెవాటియా (సి) హెట్‌మయర్‌ (బి) నోకియా 9, షంసి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 121/6; వికెట్ల పతనం: 1-6, 2-6, 3-17, 4-48, 5-55, 6-99; బౌలింగ్‌: అవేశ్‌ ఖాన్‌ 4-0-29-1, నోకియా 4-0-18-2, అశ్విన్‌ 4-0-20-1, రబాడ 4-0-26-1, అక్షర్‌ పటేల్‌ 4-0-27-1.