న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్‌కు కరోనా

ABN , First Publish Date - 2021-05-08T13:35:04+05:30 IST

కివీస్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్‌కు కరోనా బారిన పడ్డారు.....

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్‌కు కరోనా

న్యూఢిల్లీ: కివీస్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్‌కు కరోనా బారిన పడ్డారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన సీఫెర్ట్ ఇతర ఐపీఎల్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వ్యాఖ్యాతలతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టర్ విమానంలో భారతదేశం విడిచి న్యూజిలాండ్ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. టిమ్ సీఫెర్ట్ న్యూజిలాండ్ బయలుదేరే ముందు జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని విమానం ఎక్కించకుండా క్వారంటైన్ లోకి తరలించారు. కరోనా వ్యాప్తి వల్ల దేశంలో ఐపీఎల్ నిలిపివేశారు. సీఫెర్ట్ కు చికిత్స అనంతరం కొవిడ్ నెగిటివ్ రిపోర్టు వచ్చాక న్యూజిలాండ్ కు పంపిస్తారు. 


న్యూజిలాండ్ లోనూ టిమ్ కు 14రోజుల పాటు క్వారంటైన్ విధించాలని నిర్ణయించారు.ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ హస్సీ ఈ వారం ప్రారంభంలో కొవిడ్ -19 పాజిటివ్ బారిన పడ్డారు. కరోనా బారిన పడిన టిమ్ ఫ్రాంచైజ్ ఆధ్వర్యంలో ఉత్తమ చికిత్స పొందుతున్నాడని తాను నమ్ముతున్నట్లు ఎన్జీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ చెప్పారు.టిమ్ కు వైద్యసహాయం అందించినందుకు భారత క్రికెట్ పాలకమండలి అయిన బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీలకు వైట్ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-05-08T13:35:04+05:30 IST