రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ప్రకటించిన ఐపీఎల్ జట్లు

ABN , First Publish Date - 2021-01-21T02:36:13+05:30 IST

ఐపీఎల్ 2021 సందడి అప్పుడే మొదలైంది. ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఈ నెల 21తో గడువు ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలన్నీ...

రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ప్రకటించిన ఐపీఎల్ జట్లు

ఐపీఎల్ 2021 సందడి అప్పుడే మొదలైంది. ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఈ నెల 21తో గడువు ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలన్నీ వరుసగా 2021 ఐపీఎల్‌కు తాము వదులుకునే, తమ జట్టులో ఉండే ఆటగాళ్ల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా.. కొన్ని జట్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాయి. ఆటతీరు పేలవంగా ఉన్న ఆటగాళ్లను వదులుకున్నాయి. కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ ఎన్నో ఆశలు పెట్టుకుని సొంతం చేసుకున్న మ్యాక్స్‌వెల్ గత కొన్ని సీజన్‌‌లుగా చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చకపోవడంతో పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్‌ను వదులుకుంది. కాట్రెల్‌పై కూడా వేటు పడింది. కేఎల్ రాహుల్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టు నికోలస్ పూరన్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్‌ను రిటైన్ చేసుకుంది. పటిష్టంగా ఉన్న ముంబై జట్టు మలింగను మినహాయిస్తే ఏ ఒక్క ఆటగాడిని వదులుకోలేదు. అయితే.. మలింగను ముంబై వేలంలోకి విడిచిపెట్టడం కొసమెరుపు. మలింగను వదులుకున్నప్పటికీ బౌల్డ్, బూమ్రాలతో ముంబై బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఇక.. చెన్నై జట్టు మరోసారి ధోనీ సారథ్యంలోనే ఐపీఎల్ ఆడనుంది.


రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌ను ఈ జట్టు రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలోనే వెళ్లిపోయిన సురేష్ రైనాను కూడా చెన్నై జట్టు రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదుగురు ఆటగాళ్లను వేలానికి విడిచిపెట్టింది. సంజయ్ యాదవ్, సందీప్, పృధ్వీ రాజ్, అలెన్, బిల్లీ స్టాన్‌లేక్‌లను విడిచిపెట్టింది. ఇక.. బెంగళూరు జట్టు 12 మందిని మాత్రమే రిటైన్ చేసుకోవడం గమనార్హం. కోహ్లీ, డివిలియర్స్, చాహల్, నవదీప్ సైనీ, జంపా, షాబాజ్ అహ్మద్, జోస్ ఫిలిప్, రిచర్డ్‌సన్, పవన్ దేశ్‌పాండే, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్‌ను బెంగళూరు జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్మిత్‌ను వేలంలోకి వదిలిపెట్టింది. మొత్తం 8 మంది ఆటగాళ్ల జాబితాను ఆర్‌ఆర్ యాజమాన్యం విడుదల చేసింది. సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రకటించింది.

Updated Date - 2021-01-21T02:36:13+05:30 IST