Abn logo
Sep 26 2021 @ 00:39AM

అయ్యో.. రైజర్స్‌

  • స్వల్ప ఛేదనలోనూ విఫలం
  • ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమణ
  • పంజాబ్‌ అద్భుత విజయం

షార్జా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి మరో చెత్త ప్రదర్శన. కేవలం 126 పరుగులను ఛేదించలేక బ్యాటర్స్‌ చతికిలపడ్డారు. జేసన్‌ హోల్డర్‌ (29 బంతు ల్లో 5 సిక్సర్లతో 47 నాటౌట్‌) మెరుపులకు మరో ఎండ్‌ లో సహకారమే కరువైంది. దీంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 5 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింటిని ఓడిన రైజర్స్‌ ఈ రేసు నుంచి నిష్క్రమించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసి ఓడింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హోల్డర్‌ ఎంపికయ్యాడు.


హోల్డర్‌ పోరాడినా..: ఏడో నెంబర్‌ బ్యాటర్‌ హోల్డర్‌ భారీ షాట్లతో చెలరేగి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లినా ఓటమి తప్పలేదు. ఓపెనర్‌ వార్నర్‌ (2), విలియమ్సన్‌ (1)లను తన వరుస ఓవర్లలో అవుట్‌ చేసిన షమి ఆదిలోనే గట్టి ఝలక్‌ ఇచ్చాడు. 13వ ఓవర్‌లో జాదవ్‌ (12), సమద్‌ (1)లను బిష్ణోయ్‌ అవుట్‌ చేశాడు. 42 బంతుల్లో 66 పరుగులు కావాల్సిన దశలో హోల్డర్‌ మూడు సిక్సర్లతో బ్యాట్‌ ఝుళిపించాడు. మరోవైపు ఓపిగ్గా నిలిచిన సాహా సమన్వయలోపంతో రనౌటయ్యాడు. చివరి ఓవర్‌లో 17 రన్స్‌ అవసరం ఉండగా హోల్డర్‌ ఓ సిక్సర్‌ బాది ఉత్కంఠ పెంచినా ఫలితం లేకపోయింది.


ఆది నుంచీ తడబాటే..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను రైజర్స్‌ బౌలర్లు ఆరంభం నుంచే కుదురుకోనీయలేదు. ఐదో ఓవర్‌లో ఓపెనర్లు రాహుల్‌ (21), మయాంక్‌ (5)ల ను పేసర్‌ హోల్డర్‌ అవుట్‌ చేసి షాకిచ్చాడు. కట్టుది ట్టమైన బౌలింగ్‌ కారణంగా పంజాబ్‌ పవర్‌ప్లేలో 29 పరుగులే చేసింది. ఈ దెబ్బకు క్రీజులో గేల్‌ (14), మార్‌క్రమ్‌ (27) ఉన్నా ధాటిగా ఆడలేక పోయారు.  దీనికి తోడు హిట్టర్లు గేల్‌, పూరన్‌ (8) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్‌ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. ఒత్తిడి పెరగడంతో అటు మార్‌క్రమ్‌ కూడా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. చివర్లో హర్‌ప్రీత్‌ (18నాటౌట్‌), ఎల్లిస్‌ (12) బంతికో పరుగు చొప్పున సాధించినా స్వల్ప స్కోరుకే పరిమితమైంది.



స్కోరుబోర్డు


పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి సబ్‌) సుచిత్‌ (బి) హోల్డర్‌ 21; మయాంక్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 5; గేల్‌ (ఎల్బీ) రషీద్‌ 14; మార్‌క్రమ్‌ (సి) మనీశ్‌ పాండే (బి) సమద్‌ 27; పూరన్‌ (సి అండ్‌ బి) సందీప్‌ 8; హూడా (సి సబ్‌) సుచిత్‌ (బి) హోల్డర్‌ 13; హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 18; ఎల్లిస్‌ (సి) మనీశ్‌ పాండే (బి) భువనేశ్వర్‌ 12; షమి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 125/7; వికెట్ల పతనం: 1-26, 2-27, 3-57, 4-66, 5-88, 6-96, 7-118; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-20-1; భువనేశ్వర్‌ 4-0-34-1; హోల్డర్‌ 4-0-19-3; ఖలీల్‌ 3-0-22-0; రషీద్‌ 4-0-17-1; సమద్‌ 1-0-9-1.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమి 2; సాహా (రనౌట్‌) 31; విలియమ్సన్‌ (బి) షమి 1; మనీశ్‌ పాండే  (బి) బిష్ణోయ్‌ 13; జాదవ్‌ (బి) బిష్ణోయ్‌ 12; సమద్‌ (సి) గేల్‌ (బి) బిష్ణోయ్‌ 1; హోల్డర్‌ (నాటౌట్‌) 47; రషీద్‌ (సి అండ్‌ బి) అర్ష్‌దీప్‌ 3; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 120/7; వికెట్ల పతనం: 1-2, 2-10, 3-32, 4-56, 5-60, 6-92, 7-105; బౌలింగ్‌: షమి 4-1-14-2; అర్ష్‌దీప్‌ 4-0-22-1; ఎల్లిస్‌ 4-0-32-0; హర్‌ప్రీత్‌ 4-0-25-0; రవి బిష్ణోయ్‌ 4-0-24-3.