ఐపీఎల్ రద్దుతో టీ20 ప్రపంచకప్ కూడా భారత్‌కు దూరం: చాపెల్

ABN , First Publish Date - 2021-05-10T11:24:17+05:30 IST

కరోనా కారణంగా దేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2021 టోర్నీ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే దీని కారణంగా భారత్‌లోనే జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కూడా వేరే చోటకు తరలిపోయే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు.

ఐపీఎల్ రద్దుతో టీ20 ప్రపంచకప్ కూడా భారత్‌కు దూరం: చాపెల్

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2021 టోర్నీ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే దీని కారణంగా భారత్‌లోనే జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కూడా వేరే చోటకు తరలిపోయే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. వచ్చే ఏడాది భారత్‌లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ‘‘ఐపీఎల్ రద్దు అవడం ఈ ఆట పరిస్థితుల్లో దుర్బలత్వానికి నిదర్శనం’’ అని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో కొంతమంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు తేలడంతో ఈ టోర్నీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బయోబబుల్‌లో ఉన్నా కూడా ఆటగాళ్లకు కరోనా ఎలా సోకిందనే విషయంపై ఇప్పటికీ సరైన సమాధానాలు లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-05-10T11:24:17+05:30 IST