ఐక్యూ నుంచి మరో సూపర్ ఫోన్.. ధర కొంచెం ఎక్కువే!

ABN , First Publish Date - 2021-01-12T01:55:29+05:30 IST

వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ‘ఐక్యూ 7’ పేరుతో వచ్చిన ఇందులో పవర్‌ఫుల్

ఐక్యూ నుంచి మరో సూపర్ ఫోన్.. ధర కొంచెం ఎక్కువే!

న్యూఢిల్లీ: వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ‘ఐక్యూ 7’ పేరుతో వచ్చిన ఇందులో పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్ ఉపయోగించారు. ట్రిపుల్ రియర్ కెమెరా, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, అద్భుతమై ఫినిషింగ్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణలు. అలాగే, 256 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ వినియోగదారులను కట్టిపడేసే మరో అంశం. 


ఐక్యూ 7 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ కన్ఫిగరేషన్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 43,100 ఉండే అవకాశం ఉంది. 12జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 47,600. బ్లాక్, లేటెంట్ బ్లూ, లెజండరీ ఎడిషన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ నెల 15 నుంచి చైనాలో అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది తెలియరాలేదు. 


ఐక్యూ 7 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.62 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా,  ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ కలిగిన ఇందులో రెండు బ్యాటరీలు ఉపయోగించారు. ఒక్కోటి 2,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలవి. అంటే రెండు కలిపి మొత్తంగా రూ. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం. ఒకసారి చార్జింగ్‌తో 15.6 గంటల 4జీ టాక్‌టైమ్ లభిస్తుంది. 

Updated Date - 2021-01-12T01:55:29+05:30 IST