ట్రంప్‌కు అరెస్ట్‌ వారంట్‌ !

ABN , First Publish Date - 2020-06-30T13:01:32+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.

ట్రంప్‌కు అరెస్ట్‌ వారంట్‌ !

టెహ్రాన్‌, జూన్‌ 29: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. ఇరాన్‌ అగ్రశ్రేణి జనరల్‌ కాసిమ్‌ సులేమాని బాగ్దాద్‌లో గత జనవరి 3న డ్రోన్‌ దాడిలో హత్యకు గురయ్యారు. దానికి  ట్రంప్‌, మరో 30 మంది బాధ్యులుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ వారంట్‌ జారీ చేసినట్లు స్థానిక ప్రాసిక్యూటర్‌ అలీ ఆల్కాసిమెరహ్‌ సోమవారం  చెప్పారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి ఇంటర్‌ పోల్‌ సహాయం కోరినట్లు ఆయన తెలిపారు.  ట్రంప్‌కు, ఇతరులకు రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ని కోరినట్లు చెప్పారు. ఈ అంశంపై వ్యాఖ్యానించాలని ఫ్రాన్స్‌లోని లియాన్‌ కేంద్రంగా ఉన్న ఇంటర్‌పోల్‌ని కోరగా స్పందించలేదు. అమెరికా ఏకపక్షంగా టెహ్రాన్‌తో అణు ఒప్పందం ఉపసంహరించుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Updated Date - 2020-06-30T13:01:32+05:30 IST