రైలు ప్రయాణికులకు Good news...క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-11-20T13:38:12+05:30 IST

రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త వెల్లడించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా అదనపు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తెలిపింది....

రైలు ప్రయాణికులకు Good news...క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలకు ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త వెల్లడించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా అదనపు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు  ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తెలిపింది. డిసెంబరు 25వతేదీ క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రైలు నంబరు 01596 మడ్గావ్ జంక్షన్ - పన్వెల్ స్పెషల్ ఈ నెల 21వతేదీన 16:00 గంటలకు బయలు దేరనుంది.ఈ రైలు మరుసటి రోజు 03:15 గంటలకు పన్వెల్ చేరుకుంటుంది.


వచ్చే ఏడాది జనవరి 2వతేదీ వరకు ప్రతి ఆదివారం ఈ ప్రత్యేక రైలు సర్వీసు నడపనున్నారు.రైలు నంబరు 01595 పన్వెల్ - మడ్గావ్ జంక్షన్ ప్రత్యేక రైలు 06:05 గంటలకు బయలుదేరుతుంది.ఈ రైలు ఈ నెల 22వతేదీ నుంచి జనవరి 3వతేదీ వరకు నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు. ప్రయాణికులు అన్ని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్లు, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు వివరించారు.


Updated Date - 2021-11-20T13:38:12+05:30 IST