ఆ యాప్‌లో ఎందుకలా?

ABN , First Publish Date - 2020-02-08T05:30:10+05:30 IST

ఐఆర్‌సీటీసీ అప్లికేషన్‌ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతోంది. లాగిన్‌ అయ్యాక ఓపెన్‌ అవ్వదు. వాలిడేటింగ్‌ అంటూ అలాగే ఉండిపోతుంది...

ఆ యాప్‌లో ఎందుకలా?

ఐఆర్‌సీటీసీ అప్లికేషన్‌ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతోంది. లాగిన్‌ అయ్యాక ఓపెన్‌ అవ్వదు. వాలిడేటింగ్‌ అంటూ అలాగే ఉండిపోతుంది. లేదంటే వైట్‌ స్ర్కీన్‌ వచ్చి మళ్లీ అప్లికేషన్‌ వచ్చేస్తుంది. ఎలా సాల్వ్‌ చేసుకోవాలో చెప్పండి?

- డా. ప్రసాద్‌

ఐఆర్‌సీటీసీ అప్లికేషన్‌ సర్వర్‌ మీద ఎక్కువగా లోడ్‌ ఉన్నప్పుడు మీరు ఎంటర్‌ చేసిన క్రెడెన్షియల్స్‌ని సర్వర్‌లో వాలిడేట్‌ చేసుకునే సమయంలో ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం ఐఆర్‌సీటీసీ సంస్థ సర్వర్‌ సామర్ధ్యాన్ని పెంచింది. అయినప్పటకీ ఎక్కువ లోడ్‌ను హ్యాండిల్‌ చేసే విషయంలో తరచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే సర్వర్‌ పరంగా ఉండే సాంకేతికమైన ఇబ్బందులకు మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఆ సంస్థ ఇలాంటి ఇబ్బందులపై దృష్టి పెట్టాలి.

Updated Date - 2020-02-08T05:30:10+05:30 IST