బీమా పాలసీలపై ఐఆర్‌డీఏఐ తాజా మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-04-06T06:26:34+05:30 IST

సాధారణ బీమా పాలసీల డిజైనింగ్‌, ధరల విషయంలో ఐఆర్‌డీఏఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ బీమా వ్యాపారంలో సమర్థతలు పెంచడంతో పాటు పాలసీదారుల ప్రయోజనాలు కాపాడడం లక్ష్యంగా జారీ చేసిన ఐఆర్‌డీఏఐ...

బీమా పాలసీలపై ఐఆర్‌డీఏఐ తాజా మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : సాధారణ బీమా పాలసీల డిజైనింగ్‌, ధరల విషయంలో ఐఆర్‌డీఏఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ బీమా వ్యాపారంలో సమర్థతలు పెంచడంతో పాటు పాలసీదారుల ప్రయోజనాలు కాపాడడం లక్ష్యంగా జారీ చేసిన ఐఆర్‌డీఏఐ (సార్వత్రిక బీమా ఉత్పత్తులు) నిబంధనలు-2021 అన్ని బీమా ఉత్పత్తులు, యాడ్‌ ఆన్‌ ఉత్పత్తులకు వర్తిస్తాయని తెలిపింది. ఈ మార్గదర్శకాలపై ఈ నెల 26వ తేదీ లోగా సలహాలు, సూచనలు అందించాలని ఆసక్తి గల వర్గాలను ఐఆర్‌డీఏఐ కోరింది. ఉత్పత్తులకు సంబంధించిన మార్గదర్శకాలు 2000 నుంచి గందరగోళంగానే ఉన్నాయంటూ కాలానుగుణంగా వాటిని సవరిస్తూ వస్తున్నామని తెలిపింది.ఈ కొత్త మార్గదర్శకాలకు ఆమోదం లభించినట్టయితే అన్ని బీమా కంపెనీలు, ఉత్పత్తులు, యాడ్‌ ఆన్‌లకు వాటిని వర్తింపచేయనున్నట్టు తెలియచేసింది. 


Updated Date - 2021-04-06T06:26:34+05:30 IST