బెయిర్‌స్టోపై అనుచిత వ్యాఖ్యలు.. ఐర్లాండ్ బౌలర్‌కు డీమెరిట్ పాయింట్

ABN , First Publish Date - 2020-08-04T01:15:40+05:30 IST

ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య రెండు వన్‌డే మ్యాచ్‌ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెయిర్‌ స్టోపై..

బెయిర్‌స్టోపై అనుచిత వ్యాఖ్యలు.. ఐర్లాండ్ బౌలర్‌కు డీమెరిట్ పాయింట్

లండన్: ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య రెండు వన్‌డే మ్యాచ్‌ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెయిర్‌ స్టోపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఐర్లాండ్ బౌలర్‌ లిటిల్‌కు ఐసీసీ మొట్టికాయలు  వేసింది. అంతేకాకుండా ఐసీసీ నియమావళి ప్రకారం లెవెల్-1 తప్పుగా పరిగణించి ఓ డీమెరిట్ పాయింట్‌‌ను కూడా అతడి డిసిప్లినరీ రికార్డులో నమోదు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. ‘లిటిల్ బెయిర్‌స్టోను ఔట్ చేసిన వెంటనే అతడిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడాడు. లిటిల్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం అతడికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చా’మని ఐసీసీ తెలిపింది.

Updated Date - 2020-08-04T01:15:40+05:30 IST